నాకెలాంటి నోటీసులు అందలేదు: ఎమ్మెల్సీ కవిత
విధాత, హైదరాబాద్ : తనపై దుష్ర్పచారం చేస్తున్న మీడియా సంస్థలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చొని ఉన్న కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సమయాన్ని వృథా చేసుకోకుండా, వాస్తవాలను చూపించడానికి సమయం వెచ్చించాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయడానికి, నేను స్పష్టత ఇవ్వదల్చుకుంది ఏమిటంటే, నాకు ఎటువంటి నోటీసులు అందలేదని కవిత […]

విధాత, హైదరాబాద్ : తనపై దుష్ర్పచారం చేస్తున్న మీడియా సంస్థలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చొని ఉన్న కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సమయాన్ని వృథా చేసుకోకుండా, వాస్తవాలను చూపించడానికి సమయం వెచ్చించాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయడానికి, నేను స్పష్టత ఇవ్వదల్చుకుంది ఏమిటంటే, నాకు ఎటువంటి నోటీసులు అందలేదని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో కవితకు ఈడీ నోటీసులు వచ్చినట్లు పలు మీడియా సంస్థలు ప్రసారం చేయడంపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా, తెలంగాణలో పలు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే