MUNUGODE: కష్టపడితేనే… కమలమైనా, గులాబీయైనా!

విధాత: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీకి ప్రజామోదం ఉండబోతున్నదన్న ఉత్కంఠ అందరిలోనూ ఉన్నది. పార్టీల నుంచి నేతలు చేజారుతుండటం, నియోజక వర్గంలో ప్రధాన పార్టీల స్థానికేతర నేతలు మకాం వేసి ప్రచారంలో ఉండటంతో మునుగోడు ఓటర్ల మనోగతం ఏమిటన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. వివిధ ఛానల్లు, పేపర్లు ఓటర్లను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రలోభ ప్రయత్నాలు ఫలిస్తాయో.. ఈ అభర్టిని ముంచుతుందో అన్న అయోమయ పరిస్థితిలు మునుగోడు […]

  • By: krs    latest    Oct 24, 2022 7:33 AM IST
MUNUGODE: కష్టపడితేనే… కమలమైనా, గులాబీయైనా!

విధాత: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీకి ప్రజామోదం ఉండబోతున్నదన్న ఉత్కంఠ అందరిలోనూ ఉన్నది. పార్టీల నుంచి నేతలు చేజారుతుండటం, నియోజక వర్గంలో ప్రధాన పార్టీల స్థానికేతర నేతలు మకాం వేసి ప్రచారంలో ఉండటంతో మునుగోడు ఓటర్ల మనోగతం ఏమిటన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

వివిధ ఛానల్లు, పేపర్లు ఓటర్లను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రలోభ ప్రయత్నాలు ఫలిస్తాయో.. ఈ అభర్టిని ముంచుతుందో అన్న అయోమయ పరిస్థితిలు మునుగోడు నియోజవర్గంలో నెలకొన్నాయి.

అయితే ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉండబోతున్నదని స్పష్టమైంది. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అది. రాజగోపాల్ పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ నియోజవర్గంలో మొత్తం ఉనికిని ఏమీ కోల్పోలేదన్నది తెలుస్తోంది.

ఇప్పటికీ ఆ పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలు, కొన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, యువత కాంగ్రెస్ ను గట్టెక్కించే శక్తి లేకున్నా ఆ పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు.

ఇది కూసుకుంట్ల, కోమటి రెడ్డిలలో ఎవరి ఓట్లను గండి కొడుతాయో అన్న టెన్షన్ ఇరు పార్టీల నేతల్లోనూ ఉన్నది. అంతేకాదు పోటీలో ఉన్న స్వత్రంత్ర అభ్యర్థుల సహకారం తీసుకుని వాళ్ళ సామాజిక వర్గ ఓట్ల వేటలోనూ ప్రధాన పార్టీలు ఉన్నాయి.

కానీ వాళ్ళు పొద్దున ఇచ్చిన మాటను సాయంత్రానికే మారుస్తుండటం ఇంకా కలవరపెడుతున్నది. మునుగోడు లో టీఅర్ఎస్, బీజేపీల బల ప్రదర్శన, కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నమే కాదు బీఎస్పీ ఏనుగు గర్జన కూడా అక్కడక్కడ గ్రామాల్లో వినిపిస్తున్నది.

ఈ నేపథ్యంలో ప్రచారంలో నేతలు గెలుపు తమదే అని ధీమాగా ఉంటే ప్రజలు గుంభనంగా ఉన్నారు. ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది. ఓట్ల లెక్కింపు రోజున నిన్న జరిగిన ఇండియా, పాకిస్థాన్ టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్ లా చివరిదాకా ఉత్కంఠ కొనసాగేలా ఉన్నది. గెలుపు నల్లేరు నడకే అనుకునే వాళ్ళు వాస్తవ పరిస్థితుల ఆధారంగా కష్ట పడితేనే ఫలితం ఉంటుంది.