Ileana Baby Bump
విధాత, సినిమా: ఇలియానాకి పెళ్లయిందని ఒకసారి, కాలేదని మరోసారి ఇలా ఆ మధ్య వార్తలైతే బాగానే వినిపించాయి. ఆండ్రూ నిబోన్‌తో ఆమె చాలా కాలం డేటింగ్ చేసింది. వారిద్దరికి పెళ్లి కూడా అయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరి పెళ్లి కాలేదని తర్వాత తెలిసింది.
ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ కూడా జరిగింది. బ్రేకప్ తర్వాత మళ్లీ సినిమా ఛాన్స్‌ల కోసం తెగ ట్రై చేసిన ఇలియానాకు మొండిచెయ్యే ఎదురైంది. ఒకటీ ఆరా మినహా.. ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో చేసేది లేక.. మరో బాయ్‌ఫ్రెండ్‌ని చూసుకుందనేలా బాలీవుడ్‌లో టాక్ నడిచింది.
రీసెంట్‌గా అందరూ షాకయ్యేలా నేను గర్భవతిని కాబోతున్నానంటూ ఇలియనా ఓ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. ఇదేం చోద్యం.. పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇలియానా మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా త్వరలోనే నేను నా చిన్నారిని కలవబోతున్నానంటూ ఓ కామెంట్‌తో తన గర్భాన్ని రివీల్ చేసినంత పని చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు బేబీ బంప్‌తో అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. గర్భవతిని అన్నప్పుడు.. ఏదో జోక్ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వీడియోతో సహా దిగిపోయింది.
తాజాగా ఇలియానా తన బేబీ బంప్‌ని రివీల్ చేస్తూ ఓ వీడియోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా.. ఇలియానా గర్భవతే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. కాకపోతే ఆ గర్భాన్ని ఆమె ఎవరి ద్వారా పొందింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంచింది. అయితే వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ గర్భాన్ని ఆమె బాలీవుడ్‌కి చెందిన సెబాస్టియన్ మైఖేల్ ద్వారా పొందిందనేలా టాక్ నడుస్తుంది.
ఈ సెబాస్టియన్ ఎవరో కాదు.. స్వయానా హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్. ఆండ్రూతో కటీఫ్ అయిన అనంతరం.. బాలీవుడ్‌లో ట్రై చేయగా.. అవకాశాలు రాకపోవడంతో ఇక లాభం లేదనుకుని సెబాస్టియన్‌తో ఆమె డేటింగ్ ప్రారంభించిందని.. అతని ద్వారానే ఇప్పుడు గర్భం దాల్చిందనేలా టాక్ అయితే నడుస్తుంది కానీ.. దీనిపై సరైన స్పష్టత మాత్రం లేదు. మరి తను బిడ్డను కనే సమయానికైనా.. ఆ బిడ్డ తనకు కలగడానికి కారణం ఎవరనేది ఇలియానా చెబుతుందో.. లేదో.. వెయిట్ అండ్ సీ.