Kachidi | క‌చిడి చేప‌ చిక్కింది.. ల‌క్ష‌లు కుమ్మ‌రించింది! అదృష్టంమంటే ఇదే

  • By: sr    latest    Feb 03, 2025 8:31 PM IST
Kachidi | క‌చిడి చేప‌ చిక్కింది.. ల‌క్ష‌లు కుమ్మ‌రించింది! అదృష్టంమంటే ఇదే

Kachidi

విధాత‌: లక్ష్మీ దేవి ఎలా వరిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఆ దేవ‌త తలచుకుంటే రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుల‌ను బికారుల‌ను చేస్తుంది. ఓ పూట తింటే మ‌రో పూట‌కు ఎదురు చూడాల్సిన వాళ్ల‌ను లక్షాధికారులను చేస్తుంది. ఈ మాట‌లు ఇప్ప‌టికే చాలామార్లు నిజ‌మ‌య్యాయి కూడా. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. అదృష్ట‌దేవ‌త త‌లుపుత‌ట్ట‌డంతో ఓ మృత్య కారుడు.. ఒక్క రాత్రిలో లక్షాధికారి అయ్యాడు.

వివ‌రాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా సముద్రతీరంలో ఓ మ‌త్స్యారుడు ఎప్ప‌టిలానే రోజు లాగే సముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లి వల వేశాడు. అయితే ఆ వ‌ల‌లో ఎవ‌రూ ఊహించిన విధంగా మత్స్యకారుడి వలకు 25 కేజీల కచిడి (Kachidi) చేప చిక్కింది. అరుదుగా ల‌భించే ఈ త‌ర‌హా కచిడి చేపకు మార్కెట్‌లో భారీ ధ‌ర ఉంటుంది.

ఈ క్ర‌మంలో త‌న‌కు ల‌భించిన చేప‌ను కుంభాభిషేకం రేవులో వేలం వేయగా రూ.3.95 లక్షలు పలికింది. దీంతో దెబ్బకి మ‌త్స్య‌కారుడి సుడి తిరిగి ఒక్క చేప‌తో ల‌క్షాధికారి అయ్యాడు. ఈ సంద‌ర్భంగ కుటుంబ స‌భ్యులు ఆనందోత్స‌వాల‌లో తేలియాడుతున్నారు. కాగా ఈ ర‌కంచేపలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే దీనికి చాలా డిమాండ్ ఉంటుంద‌ని మత్స్యకారులుతెలిపారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడికి 30 కేజీల చేప దొరికగా ఓ వ్యాపారి రూ. 2లక్షలకు కొనుగోలు చేశాడు.

చేప ప‌త్యేక‌త‌లివే..

ఈ కచిడి చేపలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఎవ‌రికైనా శ‌స్త్ర చికిత్స‌ల అనంత‌రం కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారు. ఇక కాస్లీ వైన్‌లో ఈ చేపను వేసి ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతారు. ఈ కచిడి చేపల పొట్టభాగం ఒక్కటే రూ.80వేలకు పైగా ధరఉంటుందట. ఈ పొట్ట భాగాన్ని బలం కోసం వాడే మందుల్లో వినియోగిస్తారు. మగ చేపలు బంగారు వర్ణంలో ఉండటంతో వ‌ళ్ల వీటిని బంగారు చేపలని పిలుస్తారు. ఈ చేప ఎక్కడా స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణం చేస్తూనే ఉంటుంది.