Transgender Man | పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ట్రాన్స్‌జెండ‌ర్ మ‌గాడు

Transgender Man | ఇది అరుదైన ఘ‌ట‌న‌.. ఇంగ్లండ్‌లో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ మ‌గాడు పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాడు. పాప పుట్ట‌డంతో తాము త‌ల్లిదండ్రులం అయిపోయామ‌ని ఆ జంట సంతోషంలో మునిగి తేలుతుంది. త‌మ కోరిక నెర‌వేరింద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు ఆ దంప‌తులు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్‌కు చెందిన కాలేబ్ బోల్డెన్(27) ట్రాన్స్‌జెండ‌ర్ మ‌గాడు. బోల్డెన్ భార్య నిమా బోల్డెన్(25). నిమా, కాలేబ్ సంతానం చేయ‌ని ప్ర‌య‌త్నమంటూ లేదు. నిమా మూడు సార్లు త‌న గ‌ర్భాన్ని కోల్పోయింది. […]

Transgender Man | పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ట్రాన్స్‌జెండ‌ర్ మ‌గాడు

Transgender Man | ఇది అరుదైన ఘ‌ట‌న‌.. ఇంగ్లండ్‌లో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ మ‌గాడు పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాడు. పాప పుట్ట‌డంతో తాము త‌ల్లిదండ్రులం అయిపోయామ‌ని ఆ జంట సంతోషంలో మునిగి తేలుతుంది. త‌మ కోరిక నెర‌వేరింద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు ఆ దంప‌తులు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్‌కు చెందిన కాలేబ్ బోల్డెన్(27) ట్రాన్స్‌జెండ‌ర్ మ‌గాడు. బోల్డెన్ భార్య నిమా బోల్డెన్(25). నిమా, కాలేబ్ సంతానం చేయ‌ని ప్ర‌య‌త్నమంటూ లేదు. నిమా మూడు సార్లు త‌న గ‌ర్భాన్ని కోల్పోయింది. ప‌లు ఆరోగ్య కార‌ణాల రీత్యా ఆమె గ‌ర్భం దాల్చ‌లేక‌పోయింది. పిల్ల‌లు పుట్టే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని వైద్యులు కూడా సూచించ‌డంతో.. నిమా త‌న ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు.

దీంతో ఆమె భ‌ర్త కాలేబ్.. తానే పిల్ల‌ల‌ను కంటాన‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇక 27 నెల‌ల పాటు హ‌ర్మోన్ చికిత్స తీసుకున్నాడు. ఆ త‌ర్వాత అత‌నిలో గ‌ర్భాశ‌యం వృద్ధి చెందింది. అనంత‌రం స్పెర్మ్ డోన‌ర్‌ను ఆన్‌లైన్‌లో శోధించారు. ఆరు నెల‌ల్లో స్పెర్మ్ డోన‌ర్ ద్వారా కాలేబ్ గ‌ర్భం ధ‌రించాడు.

కాలేబ్ బేబి బంప్‌లో వృద్ధి క‌నిపించింది. ఇక అప్ప‌ట్నుంచి కాలేబ్ ఈ విష‌యం ఎవ‌రికీ తెలియ‌కుండా జాగ్ర‌త్త తీసుకున్నాడు. ఆస్ప‌త్రిలో కూడా త‌న‌కుంటూ ఒక ప్ర‌త్యేక గ‌దిని కేటాయించుకున్నాడు. ఇంగ్లండ్‌లోని వెస్ట్ స‌ఫ్లోక్ హాస్పిట‌ల్‌లో ఈ ఏడాది మే నెల‌లో కాలేబ్ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాడు. పాప ఆరోగ్యంగా ఉండ‌టంతో కాలేబ్, నిమా ఆనందంలో మునిగిపోయారు. త‌ల్లిదండ్రులు కావాల‌న్న త‌మ కోరిక తీరిపోయింద‌న్నారు.