Palvai Sravanti: టికెట్ పేరుతో.. క్యాడర్‌ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: పాల్వాయి స్రవంతి ద్వజం

విధాత: కాంగ్రెస్ టికెట్ తమకే కేటాయించారంటూ కొంతమంది నాయకులు కల్పిత ప్రచారం చేసుకుంటూ కేడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి పరోక్షంగా చల్లమల్ల కృష్ణారెడ్డి పై ధ్వజమెత్తారు . సీనియారిటీ, సిన్సియారిటీ మేరకు కాంగ్రెస్ టికెట్లు దక్కుతాయన్నారు. కోవర్టు అంటూ విమర్శలు చేస్తూ హద్దు మీరి మాట్లాడుతున్నారని కేడర్ మనోభావాలు దెబ్బ తీస్తున్నారన్నారని మండి పడ్డారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో చల్లమల్ల కృష్ణారెడ్డికి, పాల్వాయి స్రవంతికి మధ్య నెలకొన్న వర్గ పోరు […]

  • By: krs    latest    Apr 11, 2023 2:31 AM IST
Palvai Sravanti: టికెట్ పేరుతో.. క్యాడర్‌ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: పాల్వాయి స్రవంతి ద్వజం

విధాత: కాంగ్రెస్ టికెట్ తమకే కేటాయించారంటూ కొంతమంది నాయకులు కల్పిత ప్రచారం చేసుకుంటూ కేడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి పరోక్షంగా చల్లమల్ల కృష్ణారెడ్డి పై ధ్వజమెత్తారు . సీనియారిటీ, సిన్సియారిటీ మేరకు కాంగ్రెస్ టికెట్లు దక్కుతాయన్నారు.

కోవర్టు అంటూ విమర్శలు చేస్తూ హద్దు మీరి మాట్లాడుతున్నారని కేడర్ మనోభావాలు దెబ్బ తీస్తున్నారన్నారని మండి పడ్డారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో చల్లమల్ల కృష్ణారెడ్డికి, పాల్వాయి స్రవంతికి మధ్య నెలకొన్న వర్గ పోరు తాజాగా వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదే అంటూ కృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది.

మరోవైపు స్రవంతి వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వకుండా కృష్ణా రెడ్డి వర్గీయులతో మండల కమిటీలు ప్రకటిస్తుండటంపై కూడా స్రవంతి ఆగ్రహంతో ఉంది. వారిద్దరి మధ్య సాగుతున్న వర్గపోరు రానున్న ఎన్నికల నాటికి ఎటువైపు దారితీస్తుందోనని కాంగ్రెస్ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరిపోవడంతో నియోజకవర్గంలో బలహీనపడిన పార్టీలో కృష్ణారెడ్డి, స్రవంతిల మధ్య నెలకొన్న వర్గ పోరు పార్టీ కి మరింత నష్టం చేసే అవకాశం ఉందని క్యాడర్ నిరాశకు గురవుతుంది.