Cultural Centre | అట్టహాసంగా నీతా అంబానీ కల్చలర్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం.. తరలివచ్చిన సెలెబ్రెటీలు..! స్పైడర్‌ మ్యాన్‌ జంట

Cultural Centre | విధాత: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కలల ప్రాజెక్టు అయిన కల్చరల్‌ సెంటర్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు రాజకీయ, క్రీడారంగ, హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. శ్రీరామ నవమి పండగ సందర్భంగా నీతా అంబానీ ఒక రోజు ముందే కల్చరల్ సెంటర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా.. శుక్రవారం కల్చరల్‌ సెంటర్‌ను అధికారికంగా ప్రారంభించారు. దేశ కళారంగాన్ని, సాంస్కృతి వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో […]

Cultural Centre | అట్టహాసంగా నీతా అంబానీ కల్చలర్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం.. తరలివచ్చిన సెలెబ్రెటీలు..! స్పైడర్‌ మ్యాన్‌ జంట

Cultural Centre |

విధాత: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కలల ప్రాజెక్టు అయిన కల్చరల్‌ సెంటర్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు రాజకీయ, క్రీడారంగ, హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు.

శ్రీరామ నవమి పండగ సందర్భంగా నీతా అంబానీ ఒక రోజు ముందే కల్చరల్ సెంటర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా.. శుక్రవారం కల్చరల్‌ సెంటర్‌ను అధికారికంగా ప్రారంభించారు. దేశ కళారంగాన్ని, సాంస్కృతి వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో భాగంగా నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రిలయన్స్‌ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, ఆమె కుమార్తె ఇషా అంబానీ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘సాంస్కృతిక కేంద్రానికి లభిస్తున్న ఆదరణ చూసి నేను ముగ్ధురాలునయ్యాను.

ఇది ప్రపంచంలోని అత్యుత్తమ సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటి. అన్ని కళలు, కళాకారులకు ఇక్కడికి స్వాగతం. ఇక్కడ చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల యువత కూడా తమ కళలను దర్శించే అవకాశం ఉంటుంది.

ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదర్శనలు ఇక్కడికి వస్తాయని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ‘ఇది ముంబయికి, దేశం మొత్తానికి ప్రధాన కళా కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. ఇక్కడ భారీ ప్రదర్శనలు నిర్వహించవచ్చు.

భారతీయులు తమ పూర్తి కళాత్మకతతో అసలైన ప్రదర్శనలను రూపొందించగలరని నేను ఆశిస్తున్నాను’ అన్నారు. కార్యక్రమానికి భారతరత్న, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సతీమణి అంజలి, కూతురు సారా టెండూల్కర్‌ హాజరయ్యాడు.

అలాగే ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా, స్టార్ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, అథ్లెట్ దీపా మాలిక్, సూపర్ స్టార్ రజనీకాంత్, అమీర్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా-నిక్‌జోనస్‌, వరుణ్ ధావన్, సోనమ్ కపూర్, అనుపమ్ ఖేర్, జావేద్ అక్తర్, షబానా అజ్మీ, సునీల్ శెట్టి,

షాహిద్ కపూర్, విద్యాబాలన్, అలియా భట్, దియా మీర్జా, శ్రద్ధా కపూర్, రాజు హిరానీ, తుషార్ కపూర్ వంటి బాలీవుడ్ తారలు అలరించారు. అలాగే హాలీవుడ్‌కు చెందిన నటీనటులు స్పైడర్‌ మ్యాన్‌ ఫేమ్‌ టామ్‌ హోలాండ్‌ , జెండయా సైతం హాజరయ్యారు.