అసెంబ్లీ స్థానాలు: కాశ్మీర్‌లో పెంచారు.. ఆంధ్ర, తెలంగాణల్లో ఎందుకు పెంచలే!

తెలంగాణకు 153, ఆంధ్రకు 225.. అసెంబ్లీ స్థానాల పెంపుపై సుప్రీం విచారణ విధాత, హైదరాబాద్: సుప్రీంకోర్టులో కేసు నమోదు చేయడంతో తెలంగాణ, ఆంధ్రలలో అసెంబ్లీ స్థానాల పెంపు పంచాయతీ మరోసారి ముందుకు వచ్చింది. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ పర్యావరణ వేత్త పురుషోత్తమరెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని స్వీకరిస్తూ సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. చిన్న రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత తలెత్తకూడదన్న ఆశయంతో […]

  • By: Somu    latest    Sep 20, 2022 10:27 AM IST
అసెంబ్లీ స్థానాలు: కాశ్మీర్‌లో పెంచారు.. ఆంధ్ర, తెలంగాణల్లో ఎందుకు పెంచలే!
  • తెలంగాణకు 153, ఆంధ్రకు 225..
  • అసెంబ్లీ స్థానాల పెంపుపై సుప్రీం విచారణ

విధాత, హైదరాబాద్: సుప్రీంకోర్టులో కేసు నమోదు చేయడంతో తెలంగాణ, ఆంధ్రలలో అసెంబ్లీ స్థానాల పెంపు పంచాయతీ మరోసారి ముందుకు వచ్చింది. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ పర్యావరణ వేత్త పురుషోత్తమరెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని స్వీకరిస్తూ సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. చిన్న రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత తలెత్తకూడదన్న ఆశయంతో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచుతూ చట్టంలో పొందు పరిచింది యూపీఏ ప్రభుత్వం.

అసెంబ్లీ స్థానాలను తెలంగాణలో 153కు, ఆంధ్రప్రదేవ్‌లో 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిర్దేశిస్తున్నది. అయితే రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ స్థానాలను పెంచడం సాధ్యం కాదని, పునర్విభజన చట్టంలో అధికరణం 170 ప్రకారం చేయాలని సూచించారని కేంద్రం వాదిస్తున్నది.

అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తర్వాత తెచ్చిన జమ్ము కాశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యను ఇదే బీజేపీ ప్రభుత్వం పెంచింది. కాశ్మీర్ అసెంబ్లీ స్థానాల పెంపును ఆగమేఘాలపై పూర్తి చేసిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రల విషయంలో వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. కాశ్మీర్ పునర్విభజన రాజ్యాంగ సవరణ ద్వారానే కేంద్రం పూర్తి చేసింది.

రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీ, ఎన్డీఏలకు పార్లమెంటులో ముందు నుంచి ఉంది. ఎటొచ్చీ ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేకపోవడం వల్లనే అసెంబ్లీ స్థానాల పెంపును పక్కన పడేసింది.

ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కడమే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏడు మండలాలను తీసి ఆంధ్రకు సమర్పించడానికి అత్యుత్సాహం చూపిన బీజేపీ అసెంబ్లీ స్థానాలను ఎందుకు పెంచడం లేదని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది తార్కాణమని వారంటున్నారు.