IND VS NZ: ఉత్కంఠ పోరులో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
విధాత: ఉప్పల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి దాకా నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో భారత్ కివీస్‌పై 12 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని దక్కించుకున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఓపెనర్లు కెప్టెన్ రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడారు. ప్రారంభంలో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడం కష్టంగానే మారింది. అయితే నిలకడగా ఆడిన రోహిత్, శుభ్‌మన్‌లు భారత్ స్కోర్ […]

విధాత: ఉప్పల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి దాకా నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో భారత్ కివీస్‌పై 12 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని దక్కించుకున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఓపెనర్లు కెప్టెన్ రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడారు.
ప్రారంభంలో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడం కష్టంగానే మారింది. అయితే నిలకడగా ఆడిన రోహిత్, శుభ్‌మన్‌లు భారత్ స్కోర్ రేటును పెంచారు. 13 ఓవర్ల వరకు భారత జట్టు స్కోరు 61 పరుగులు మాత్రమే. అదే ఓవర్లలో రోహిత్ (34) ఔటయ్యాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ 8 పరుగులకే క్లీన్‌బోల్డ్ కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
అయితే గిల్ 18 ఓవర్‌లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 21 ఓవర్లకు భారత్ 122 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ కూడా 5 రన్స్‌కే ఔట్ అయ్యాడు. అనంతరం సూర్యకుమార్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇద్దరూ మెల్లగా ఆడుతూ అవకాశం చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. శుభ్‌మన్ గిల్ 84 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా స్కోర్ బోర్డు పెంచుకుంటూనే వికెట్లు కూడా కోల్పోయింది.
సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్యా (22) పరుగులు సాధించి ఫరవాలేదనిపించారు. కానీ పాండ్యా ఔటయ్యాక వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ లు నిరాశకు గురిచేశారు. కానీ శుభ్‌మన్ గిల్ 122 బంతుల్లో 150, 145 బంతుల్లో 200 పరుగులు సాధించి వాహ్ అనిపించాడు.
ఉప్పల్ స్టేడియం సిక్సుల మోత మోగించాడు. 208 పరుగుల వద్ద గిల్ ఔటయ్యాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. కివీస్ బౌలర్లలో మిచెల్, షిప్లే తలో 2 వికెట్లు తీయగా. ఫెర్గూసన్, టిక్నర్, శాంటర్న్ చెరో వికెట్ పడగొట్టారు.
భారత్ నిర్దేశించిన 350 నిర్దేశించిన లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాటర్లు చివరి దాకా పోరాడారు. కానీ 49.2 ఓవర్లలో 337 పరుగులకే ఆలౌట్ అయ్యారు. కివీస్ బ్యాటర్లలో బ్రాస్‌లెస్ (140), శాంటర్న్ (57) హాఫ్ సెంచరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.
ఒక దశలో టార్గెట్ ఛేదిస్తారనేలా వాళ్లు బ్యాటింగ్ చేశారు. కానీ చివర్లో భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. దీంతో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో సిరాజ్ 4, కుల్‌దీప్, శార్దూల్ చెరో 2, షమీ, హార్దిక్ తలో 1 వికెట్ పడగొట్టారు.
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించింది ఎవరంటే..
వన్డేల్లో డబుల్ సెంచరీ అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ ఫీట్ తొమ్మిది మంది సాధించగా తాజాగా ఉప్పల్‌లో న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించి ఆ జాబితాలో చేరాడు. దీంతో ఇప్పటివరకు డబుల్ సెంచరీ సాధించింది 10 మంది మాత్రమే.
వాళ్లు ఎవరంటే.. రోహిత్ శర్మ (264) శ్రీలంకతో ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గఫ్తిల్ 2015లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 237 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్‌పై విరుచుకుపడి 219 రన్స్ చేశాడు.
టీ20 అంటే క్రిస్ గేల్ గుర్తుకు వస్తాడు. అలా ఉండేది అతని ఆట. గేల్ కూడా జింబాబ్వేతో 2015లో జరిగిన మ్యాచ్‌లో 215 పరుగులు సాధించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఫఖర్ జమాన్ 2018లో జింబాబ్వేపై 210 డబుల్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 210 రన్స్ చేశాడు.
రోహిత్ శర్మ తన రెండో డబుల్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాపై 2013లో జరిగిన మ్యాచ్‌లో 209 రన్స్ బాదాడు. రోహిత్ ముచ్చటగా తన మూడో డబుల్ సెంచరీని మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 208 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ తాజాగా ఉప్పల్ న్యూజిలాండ్‌పై 208 రన్స్ చేశాడు.
క్రికెట్ గాడ్‌గా పిలుచుకునే మన సచిన్ కూడా తన ఖాతాలో డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 2010లో సౌతాఫ్రికాపై 200 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. డబుల్ సెంచరీలు సాధించిన 10 మంది బ్యాటర్లలో భారత బ్యాట్స్‌మెన్‌లు 5 గురు ఉండటం విశేషం. మన దేశానికి గర్వకారణం.