INDIA | ప్రతిపక్ష కూటమి పేరు ‘ఇండియా’

INDIA బెంగుళూర్ విపక్షాల భేటీలో నామకరణం విధాత: రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ సారధ్యంలో జట్టు కట్టిన విపక్షాలు బెంగుళూర్‌లో నిర్వహిస్తున్న భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. విపక్షాల కూటమికి ఇండియాగా బెంగుళూరు విపక్షాల భేటి నామకరణం చేసింది. ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్ క్లూసివ్ అలయన్స్ (ఐఎన్‌డిఐఏ) గా పేరు ఖరారు చేస్తు భేటీలో విపక్ష పార్టీల నేతలంతా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ప్రజాస్వామ్య సమిష్టి కూటమి(ఇండియా) పేరుతో ప్రజల్లోకి […]

  • Publish Date - July 18, 2023 / 09:39 AM IST

INDIA

  • బెంగుళూర్ విపక్షాల భేటీలో నామకరణం

విధాత: రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ సారధ్యంలో జట్టు కట్టిన విపక్షాలు బెంగుళూర్‌లో నిర్వహిస్తున్న భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. విపక్షాల కూటమికి ఇండియాగా బెంగుళూరు విపక్షాల భేటి నామకరణం చేసింది.

ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్ క్లూసివ్ అలయన్స్ (ఐఎన్‌డిఐఏ) గా పేరు ఖరారు చేస్తు భేటీలో విపక్ష పార్టీల నేతలంతా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ప్రజాస్వామ్య సమిష్టి కూటమి(ఇండియా) పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది