వరల్డ్ కప్ ఫైనల్ కి దూసుకెళ్లిన భారత్

వరల్డ్ కప్ ఫైనల్ కి దూసుకెళ్లిన భారత్

విధాత : క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 70 రన్స్ తేడాతో విజయం సాధించింది. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

భారత పెసర్ మహమ్మద్ షమీ 57 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక భూమిక పోషించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా కోహ్లీ 117 శ్రేయస్ అయ్యర్ 105, శుభమన్ గిల్ 80, రోహిత్ 47, రాహుల్ 39పరుగుల సహాయంతో 398 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. లక్ష చేధనలో న్యూజిలాండ్ బ్యాటర్స్ పోరాడినప్పటికీ సెమీ ధాటికి ఓటమిపాలైంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో డారెల్ మిచెల్ 134, కెన్ విలియమ్ సన్ 69, ఫిలిప్స్ 41 రాణించారు. భారత బౌలర్లలో షమీకి ఏడూ వికెట్లు రాగా, భూమ్రా, సిరాజ్, కుల్దీప్ తలో వికెట్ సాధించారు.