Indian Economy | ఆర్థిక వ్యవస్థ నిజంగానే పెరుగుతున్నదా?
Indian Economy విధాత: దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగానే పెరుగుతున్నదా? ఈ ప్రచారంలో అసలు వాస్తవం ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ తీవ్ర ఆర్థిక మాద్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బాగా అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకొంటున్న అమెరికా, జపాన్ వంటి దేశాలకు కూడా ఆర్థిక మాద్యం తప్పడం లేదు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటున్నదని, ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రతి వేదికపైనా ఊదరగొడుతున్నారు. మరోవైపు ప్రధాన […]

Indian Economy
విధాత: దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగానే పెరుగుతున్నదా? ఈ ప్రచారంలో అసలు వాస్తవం ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ తీవ్ర ఆర్థిక మాద్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బాగా అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకొంటున్న అమెరికా, జపాన్ వంటి దేశాలకు కూడా ఆర్థిక మాద్యం తప్పడం లేదు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటున్నదని, ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రతి వేదికపైనా ఊదరగొడుతున్నారు.
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన విదేశీ పర్యటన సందర్భంగా భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అతి త్వరలో ఆవిర్భవించనున్నదని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. దేశ ప్రగతిని చాటుకుంటూ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ఎన్నికల రాజకీయాలలో అసలు విషయం దాచి.. అబద్ధాలతో ఊదరగొడుతున్నారు.
అంతా నిజమేనా? ఇదంతా వట్టిదేనని ఎప్పటికప్పుడు వస్తున్న నివేదికలు రుజువు చేస్తున్నాయి. తాజాగా.. కర్నెల్ యూనివర్సిటీ ఆర్ధిక శాస్త్రవేత్త, ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్ధిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కౌశిక్ బసు ఈ మధ్య ఒక సందర్భంలో తాజాగా విడుదల చేసిన ప్రపంచ నిరుద్యోగ సమస్య రేటు ఒక మంచి ఉదాహరణ.
ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో నిరుద్యోగ సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉన్నది. అంటే మనకన్నా మరో నాలుగు దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి.. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉన్నదని అర్థం. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా చూస్తే.. కొంత అభివృద్ధి చెందినట్టు కనిపిస్తున్నా.. అది కొన్ని ధనిక వర్గాల అభవృద్ధి మాత్రమే తప్ప మరేమీకాదు.
విడి విడిగా వివరాల్లోకి వెళ్ళి విషయాలను పరిశీలిస్తే.. అనేక వర్గాలు, ప్రజలు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారు. కొంత మంది ధనికుల అభివృద్దినే దేశ అభివృద్ధిగా చెప్పడమంటే అది సగటు దేశ ప్రజలను మోసం చేయటమే అవుతుంది. ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందే దేశాల్లో భారత్ ఒకటి అనే ప్రచారంలో నిజం లేదు అనేది నిస్సందేహం.