గ్రామీ అవార్డుల్లో భారత పతాకం రెపరెపలు.. రికీ కేజ్‌కు మూడో గ్రామీ అవార్డు..!

Grammy award | గ్రామీ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా సాగింది. 65వ గ్రామీ అవార్డుల్లో మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. బెంగళూరుకు చెందిన మ్యూజిషియన్‌ రికీ కేజ్‌ మూడోసారి గ్రామీ అవార్డును అందుకున్నాడు. రికీ ఆల్బమ్‌ ‘డివైన్‌ టైడ్స్‌’కు ఈ అవార్డు దక్కింది. ప్రముఖ బ్రిటిష్‌ ర్యాక్‌ బ్యాండ్‌ ‘ది పోలీస్‌’ డ్రమ్మర్‌ స్టీవర్ట్‌ కోప్‌ల్యాండ్‌తో సంయుక్తంగా రికీ ఈ అవార్డును అందుకున్నాడు. స్టీవర్ట్‌ కోప్‌ల్యాండ్‌ ఈ ఆల్బమ్‌లో రికీతో కలిసి పని చేశాడు. 65వ […]

గ్రామీ అవార్డుల్లో భారత పతాకం రెపరెపలు.. రికీ కేజ్‌కు మూడో గ్రామీ అవార్డు..!

Grammy award | గ్రామీ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా సాగింది. 65వ గ్రామీ అవార్డుల్లో మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. బెంగళూరుకు చెందిన మ్యూజిషియన్‌ రికీ కేజ్‌ మూడోసారి గ్రామీ అవార్డును అందుకున్నాడు. రికీ ఆల్బమ్‌ ‘డివైన్‌ టైడ్స్‌’కు ఈ అవార్డు దక్కింది. ప్రముఖ బ్రిటిష్‌ ర్యాక్‌ బ్యాండ్‌ ‘ది పోలీస్‌’ డ్రమ్మర్‌ స్టీవర్ట్‌ కోప్‌ల్యాండ్‌తో సంయుక్తంగా రికీ ఈ అవార్డును అందుకున్నాడు.

స్టీవర్ట్‌ కోప్‌ల్యాండ్‌ ఈ ఆల్బమ్‌లో రికీతో కలిసి పని చేశాడు. 65వ గ్రామీ అవార్డ్స్‌లో ఇద్దరూ ఆడియో ఆల్బమ్ విభాగంలో గ్రామోఫోన్ ట్రోఫీని అందుకున్నారు. ఇంతకు ముందు రికీ కేజ్‌ ‘విండ్స్‌ ఆఫ్‌ సంసార’ ఆల్బమ్‌కు 2015లో తొలిసారిగా గ్రామీ అవార్డును అందుకున్నాడు.

తాజాగా 2022 సంత్సరానికి గాను ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు గాను ‘బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌’ విభాగంలో స్టీవర్ట్‌ కోప్‌ల్యాండ్‌తో సంయుక్తంగా అవార్డును గెలుచుకున్నాడు. ఇక రికీ కేజ్‌ తన కెరీర్‌ మొత్తంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం సహా అనేక ప్రతిష్టాత్మక వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. రికీ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో దాదాపు వంద వరకు మ్యూజికల్‌ అవార్డులను కైవసం చేసుకున్నాడు.

యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ హ్యుమానిటేరియన్ ఆర్టిస్ట్, యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియాకు నామినేట్‌ అయ్యాడు. 2021 సంవత్సరంలో విడుదలైన ఆల్బమ్ ‘డివైన్ టైడ్స్’లో తొమ్మిది పాటలు, ఎనిమిది మ్యూజిక్ వీడియోలు ఉన్నాయి. తన కెరీర్‌లో మూడో గ్రామీ అవార్డు అందుకున్న రికీ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ అభినందనలు సార్‌ అంటూ ట్వీట్‌ చేసింది.