INDIA | మోదీ సిగ్గుమాలిన ఉదాసీనత
INDIA | కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి మణిపూర్‌లో ఇండియా కూటమి ఎంపీలు ఇంఫాల్: మణిపూర్‌లో హింసను నిలువరించేందుకు, శాంతి సామరస్యాలను పునరుద్ధరించేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికేకు వినతిపత్రం సమర్పించిన ప్రతిపక్ష ఎంపీలు.. ఇక్కడ జరుగుతున్న హింస విషయంలో మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మోదీ మౌనం.. ఈ రాష్ట్రం పట్ల ఆయన […]

INDIA |
- కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి
- మణిపూర్‌లో ఇండియా కూటమి ఎంపీలు
ఇంఫాల్: మణిపూర్‌లో హింసను నిలువరించేందుకు, శాంతి సామరస్యాలను పునరుద్ధరించేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికేకు వినతిపత్రం సమర్పించిన ప్రతిపక్ష ఎంపీలు.. ఇక్కడ జరుగుతున్న హింస విషయంలో మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
మోదీ మౌనం.. ఈ రాష్ట్రం పట్ల ఆయన సిగ్గుమాలిన ఉదాసీనతను చాటుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత ప్రజల్లో ఒక విధామైన పరాధీన భావన నెలకొని ఉన్నదన్న ఎంపీలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి, తక్షణం జోక్యం చేసుకోవాల్సిందిగా కోరాలని ఆ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ముందు బాధిత ప్రజల పునరావాసానికి చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అంతకు ముందు ఎంపీలు మెయితీ శరణార్థులు, కుకీ శరణార్థులు వేర్వేరుగా తలదాచుకుంటున్న సహాయ శిబిరాలను సందర్శించి, వారితో మాట్లాడారు.
వారి బాధలు విని ధైర్యం చెప్పారు. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించి న్యూఢిల్లీకి బయల్దేరారు. శరణార్థి శిబిరాలు బాధాకరంగా ఉన్నాయని వినతిపత్రంలో తెలిపారు. అక్కడ ఉన్న బాధితుల ఒక్కో కథ గుండెను పిండివేసిందని పేర్కొన్నారు.