Edible Oil | భారీగా పడిపోయిన ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులు..! పామాయిల్‌ ధరలు పెరిగే ఛాన్స్‌..!

దేశంలో ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులు భారీగా తగ్గుతున్నాయి. గతేడాదితో పోలిస్తే జనవరిలో 28శాతం తగ్గి 1.2 మిలియన్‌ టన్నులకు చేరాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) తెలిపింది.

Edible Oil | భారీగా పడిపోయిన ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులు..! పామాయిల్‌ ధరలు పెరిగే ఛాన్స్‌..!

Edible Oil | దేశంలో ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులు భారీగా తగ్గుతున్నాయి. గతేడాదితో పోలిస్తే జనవరిలో 28శాతం తగ్గి 1.2 మిలియన్‌ టన్నులకు చేరాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) తెలిపింది. జనవరి 2023లో కూరగాయల నూనె దిగుమతులు 1.661 మిలియన్ టన్నులుగా రికార్డయ్యాయి. భారతదేశం ప్రపంచంలోనే ప్రముఖ విజిటెబుల్‌ ఆయిల్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది.


ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికం (నవంబర్-జనవరి)లో మొత్తం దిగుమతులు 23 శాతం తగ్గి 3.67 మిలియన్ టన్నులకు చేరాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో 4.773 మిలియన్ టన్నులు ఉన్నాయి. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో మొత్తం విజటబుల్‌ నూనెలలో దాదాపు 782,983 టన్నుల పామాయిల్, 408,938 టన్నుల సాఫ్ట్ ఆయిల్ దిగుమతి అయ్యాయి.


ఫిబ్రవరి 1 నాటికి మొత్తం ఎడిబుల్ ఆయిల్స్ స్టాక్ 2.649 మిలియన్ టన్నులుగా ఉన్నది. ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 7.64 శాతం తగ్గింది. తక్కువ ఉత్పత్తి, ప్రపంచంగా ఆర్థిక సమస్యలు, సరఫరా పరిమితుల కారణంగా ప్రస్తుతం తక్కువగా ఉన్న ఎడిబుల్ ఆయిల్స్ ధరలు ఈ ఏడాది పెరగవచ్చని సాల్వెంట్‌ అసోసియేషన్‌ అంచనా వేసింది. మలేషియా, ఇండోనేషియా దేశాలు ఎడిబుల్‌ ఆయిల్‌కు అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంటాయి.


అయితే, ఈ రెండు దేశాలు ఎడిబుల్‌ ఆయిల్‌ను బయో డీజిల్‌ ఉత్పత్తికి మళ్లించింది. దీంతో పామాయిల్‌ లభ్యత తగ్గుతున్నది. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉందని సాల్వెంట్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. భారతదేశం ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్, అర్జెంటీనా నుంచి సోయాబీన్‌తో సహా తక్కువ మొత్తంలో క్రూడ్ సాఫ్ట్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా నుండి దిగుమతి అవుతుంది.