టీఆర్‌ఎస్‌లో చేరిన పారిశ్రామికవేత్త రవి కుమార్‌

విధాత: మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో టీఆర్‌ఎస్‌లోకి జోరు వలసలు కొనసాగుతున్నాయి. శ్రవణ్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త పనస రవి కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు మంత్రి కేటీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీసీ కార్యకర్తలు, నాయకుల పట్ల బీజేపీ అనుసరిస్తున్న తీరు నచ్చకపోవడంతో సీనియర్‌ నేత, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్‌ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో […]

  • By: krs    latest    Oct 22, 2022 10:37 AM IST
టీఆర్‌ఎస్‌లో చేరిన పారిశ్రామికవేత్త రవి కుమార్‌

విధాత: మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో టీఆర్‌ఎస్‌లోకి జోరు వలసలు కొనసాగుతున్నాయి. శ్రవణ్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త పనస రవి కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు మంత్రి కేటీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

బీసీ కార్యకర్తలు, నాయకుల పట్ల బీజేపీ అనుసరిస్తున్న తీరు నచ్చకపోవడంతో సీనియర్‌ నేత, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్‌ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌ లో చేరిన విషయం తెలిసిందే.