Miryalaguda: ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రాత్రి బస..! మాజీ MLA శ్రీనివాస్ వినూత్న నిరసన!!

విధాత: మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ మరోసారి వినూత్న నిరసనతో ఆకట్టుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ ధాన్యాన్ని తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్నప్పటికి కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ రేపాల శ్రీనివాస్ కొనుగోలు కేంద్రంలో వినూత్న నిరసన నిర్వహించారు. శనివారం వేములపల్లి ఐకెపి సెంటర్ సందర్శించిన రేపాల శ్రీనివాస్ రైతుల సమస్యలు తెలుసుకొని ధాన్యం రాసులపై నల్ల జెండాలు పాతి అక్కడ ఉన్న రైతులకు మంచినీరు, భోజన వసతి కల్పించి, ఆ రాత్రి […]

Miryalaguda: ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రాత్రి బస..! మాజీ MLA శ్రీనివాస్ వినూత్న నిరసన!!

విధాత: మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ మరోసారి వినూత్న నిరసనతో ఆకట్టుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ ధాన్యాన్ని తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్నప్పటికి కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ రేపాల శ్రీనివాస్ కొనుగోలు కేంద్రంలో వినూత్న నిరసన నిర్వహించారు.

శనివారం వేములపల్లి ఐకెపి సెంటర్ సందర్శించిన రేపాల శ్రీనివాస్ రైతుల సమస్యలు తెలుసుకొని ధాన్యం రాసులపై నల్ల జెండాలు పాతి అక్కడ ఉన్న రైతులకు మంచినీరు, భోజన వసతి కల్పించి, ఆ రాత్రి అక్కడే వారితో పాటే భోజనం చేసి నిద్రించారు. ఆదివారం ఉదయం నిద్రలేచిన తర్వాత అక్కడే కాలకృత్యాలు, స్నానం ముగించుకొని రైతులతో కలిసి అల్పాహారం చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల ప్రతిధాన్యం గింజ కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వట్టిమాటలు చెబుతుందన్నారు. నిన్నటి నుండి ఐకెపి సెంటర్ లోనే ఉన్న తాను రైతులు పడుతున్న ఇబ్బందులు ఏమిటో ప్రత్యక్షంగా చూశానన్నారు. అందరి ఆకలి తీర్చే రైతన్న బాధలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమవ్వడం విచారకరమన్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం రాసులు తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు.

వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, రైతులకు కావాల్సిన పాలిథిన్ కవర్లు, భోజన, మంచినీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.