Team India | ఒకప్పుడు కిట్ కొనే పరిస్థితి లేదు.. ఇప్పుడు టీమిండియా జట్టులోకి హైదరాబాదీ క్రికెటర్..!
Team India: ఐపీఎల్ టోర్నీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న భారత ఆటగాళ్లు విండీస్ టూర్‌కి సిద్ధమయ్యారు. ఈ టూర్‌లో కొత్త కుర్రాళ్లని ఎవరెవరిని ఎంపిక చేస్తారంటూ కళ్లప్పగించి చూశారు. ఈ క్రమంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకి ఇండియన్ టీమ్ లో ఛాన్స్ దక్కింది. మరి కొద్ది రోజులలో జరగనున్న విండీస్‌తో టీ20 సిరీస్‌కు తిలక్‌కు స్థానం కల్పించింది బీసీసీఐ. మొత్తానికి టీమిండియా జెర్సీ ధరించాలనే ఆయన కల త్వరలోనే నెరవేరనుంది. ఇక ఎలాంటి ఒత్తిడిలోనైనా […]

Team India:
ఐపీఎల్ టోర్నీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న భారత ఆటగాళ్లు విండీస్ టూర్‌కి సిద్ధమయ్యారు. ఈ టూర్‌లో కొత్త కుర్రాళ్లని ఎవరెవరిని ఎంపిక చేస్తారంటూ కళ్లప్పగించి చూశారు. ఈ క్రమంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకి ఇండియన్ టీమ్ లో ఛాన్స్ దక్కింది. మరి కొద్ది రోజులలో జరగనున్న విండీస్‌తో టీ20 సిరీస్‌కు తిలక్‌కు స్థానం కల్పించింది బీసీసీఐ.
మొత్తానికి టీమిండియా జెర్సీ ధరించాలనే ఆయన కల త్వరలోనే నెరవేరనుంది. ఇక ఎలాంటి ఒత్తిడిలోనైనా భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ స్థాయికి చేరుకోవడానికి తన తండ్రి నాగార్జున కృషి, కష్టం ఎంతో ఉంది. తిలక్ వర్మ తండ్రి వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ కాగా, కుమారుడి కలని నెరవేర్చేందుకు చాలా కష్టపడ్డాడు.
కుమారుడికి క్రికెట్ అంటే ఇష్టమని తెలిసి ఎంతగానో ప్రోత్సహించాడు. రూపాయి రూపాయి దాచి తిలక్‌ను స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించాడు. ఈ తెలుగబ్బాయి ట్యాలెంట్‌ను గుర్తించిన కోచ్ సలామ్ బయాష్ ఎలాంటి కోచింగ్ ఫీజు తీసుకోకుండానే అతనికి శిక్షణ ఇచ్చాడు.
లింగంపల్లిలోని తన అకాడమీకి తిలక్ ను తీసుకెళ్లి కోచింగ్ ఇచ్చాడు. కోచింగ్ కోసం రోజూ బండ్లగూడ నుంచి లింగంపల్లికి 40 కి.మీ వెళ్లేవాడు. కుమారుడి కష్టం చూడలేక పేరెంట్స్ తర్వాత లింగంపల్లికి మారారు. అయితే తిలక్ కూడా ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఏడాది తిరిగేలోపే హైదరాబాద్ అండర్14 టీమ్‌లో చోటు దక్కించుకొని దూసుకుపోయాడు.
2018లో అండర్19 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న తిలక్.. 2019లో హైదరాబాద్ రంజీ జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. ఇక, 2022లో రూ.20 లక్షల కనీస ధరతో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన తిలక్ వర్మ ఈ సీజన్‌లో బాగానే రాణించాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో 164 స్ట్రయిక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు.
అతని టాలెంట్ గుర్తించిన సెలక్షన్ కమిటీ టీమిండియాలోకి వచ్చే సత్తా తిలక్ వర్మకి ఉందని భావించి వెస్టిండీస్ టూర్ కు ఎంపిక చేశారు. తన కన్న కల నిజం చేసుకున్నందుకు మన హైదరాబాదీ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. విండీస్ టూర్‌లో కనుక తిలక్ వర్మ రాణిస్తే ఆయన కెరీర్‌కి తిరుగుండదు.