ఇంటర్ కళాశాలలకు సెలవులు
తెలంగాణలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొనసాగనున్నాయి

విధాత : తెలంగాణలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొనసాగనున్నాయి. మళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీలకు వర్తించనున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలను నిర్వహించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు పేర్కోంది. మళ్లీ బోర్డు నుంచి ప్రకటన వచ్చిన తర్వాతనే వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకోవాలని, ఆ తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు.