ఎందుకు రావ‌ట్లేదు? పిలిస్తే కదా వచ్చేది?: KTR, ఈటల మధ్య ఆసక్తికర సంభాషణ

ఈటల, కేటీఆర్‌ సంభాషణలో జోక్యం చేసుకున్న భట్టి ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు విధాత: గవర్నర్‌ ప్రసంగానికి ముందు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్నది. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ల వద్దకు వచ్చి మాట్లాడారు. ఈటలతో ప్రత్యేకంగా సంభాషించారు. హుజూరాబాద్‌లో అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదని ఈటలను మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించినట్టు సమాచారం. పిలిస్తే కదా హాజరయ్యేదని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. […]

  • Publish Date - February 3, 2023 / 04:17 PM IST
  • ఈటల, కేటీఆర్‌ సంభాషణలో జోక్యం చేసుకున్న భట్టి
  • ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు

విధాత: గవర్నర్‌ ప్రసంగానికి ముందు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్నది. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ల వద్దకు వచ్చి మాట్లాడారు. ఈటలతో ప్రత్యేకంగా సంభాషించారు.

హుజూరాబాద్‌లో అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదని ఈటలను మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించినట్టు సమాచారం. పిలిస్తే కదా హాజరయ్యేదని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం సరిగ్గా లేదని ఈటల రాజేందర్‌ ఈ సందర్భంగా హితవు పలికారు.

ఈటల, కేటీఆర్‌ సంభాషణ మధ్యలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జోక్యం చేసుకున్నారు. తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని మంత్రి ముందు ప్రస్తావించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కలెక్టర్‌ నుంచైనా ఎమ్మెల్యేలను ఆహ్వానించాలన్న ఈటల వ్యాఖ్యలకు కేటీఆర్‌ నవ్వి ఊరుకున్నారు.

ఈలోగా గవర్నర్‌ సభలోకి వస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేటీఆర్‌ను అప్రమత్తం చేయగా.. తన ట్రెజరీ బెంచివైపు ఆయన వెళ్లిపోయారు. కేటీఆర్‌ కంటే ముందు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కొద్దిసేపు ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడారు.