Multiplex | హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. మల్టీప్లెక్స్‌లో స్క్రీన్స్ అన్నీ దగ్ధం
Multiplex | హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో భయబ్రాంతులకి గురవుతున్నారు. ఒక ఘటన మరచిపోక ముందే మరో ఘటన జరుగుతుంది. తాజాగా చందానగర్‌లోని జేపీ సినిమాస్ (మల్టీఫ్లెక్స్)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, చుట్ట పక్కల వారు ఉలిక్కిపడ్డారు. శనివారం తెల్లవారు జామున జాతీయ రహదారికి పక్కనేఉన్న తపాడియస్ మారుతిమాల్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడం, అదే ఈ మాల్‌లోని ఐదో అంతస్తులో ఉన్న మల్టీ ప్లెక్స్(జేపీ సినిమాస్)లో స్క్రీన్లు అన్ని కాలిపోవడం జరిగింది. అయితే […]

Multiplex |
హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో భయబ్రాంతులకి గురవుతున్నారు. ఒక ఘటన మరచిపోక ముందే మరో ఘటన జరుగుతుంది. తాజాగా చందానగర్‌లోని జేపీ సినిమాస్ (మల్టీఫ్లెక్స్)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, చుట్ట పక్కల వారు ఉలిక్కిపడ్డారు.
శనివారం తెల్లవారు జామున జాతీయ రహదారికి పక్కనేఉన్న తపాడియస్ మారుతిమాల్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడం, అదే ఈ మాల్‌లోని ఐదో అంతస్తులో ఉన్న మల్టీ ప్లెక్స్(జేపీ సినిమాస్)లో స్క్రీన్లు అన్ని కాలిపోవడం జరిగింది. అయితే ఈ మల్టీప్లెక్స్‌లో స్క్రీన్స్, ఫర్నీచర్‌తో పాటు సీట్లు కూడా కాలిపోయాయని చెబుతున్నారు..
అగ్ని ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ఫైర్, డీఆర్ఎఫ్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో 6, 7 అంతస్తుల్లోకి మంటలు వ్యాపించకుండా మంటలని అదుపులోకి తెచ్చారు. భారీ క్రేన్ సాయంతో పై అంతస్తులకి మంటలని వ్యాపించకుండా చేశారు.
Fire accident in JP Cinemas Chanda Nagar this morning. Without Fire NOC how many such multiplexes are there in our city and state? pic.twitter.com/SEVgYpc1BO
— Shakeel Yasar Ullah (@yasarullah) August 12, 2023
అయితే ఉదయం 6గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కొంత ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి. ఆ సమయంలో మాల్‌లో ఎవరు లేకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆసక్తి నష్టమే జరిగిందని అంచనా వేస్తున్నారు. తపాడియా మాల్ ఇటీవలే ప్రారంభం అయింది.
ఇంకా షాప్స్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరగడం, పెద్ద ఎత్తున ఫర్నీచర్ కాలిపోవడం అనేది సస్పెన్స్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ సాగుతుంది.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా, ఆయన త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. షాపింగ్ మాల్‌కి ఫైర్ ఎన్ఓసీ లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే జేపీ సినిమాస్ యాజమాన్యం సినిమాలు వేస్తున్నట్టు వారు తెలియజేశారు.
Fire in Maruthi Infinity Mall Chanda Nagar, Hyderabad. Five screens got burnt. Fire tenders and DRF teams reached to the spot to extinguish the flames. No casualties reported so far.@XpressHyderabad @NewIndianXpress pic.twitter.com/14AJ0ikME6
— Bachanjeetsingh_TNIE (@Bachanjeet_TNIE) August 12, 2023