జాతీయ డ్యాం సెఫ్టీ ఆథార్టీ నివేదికను తిప్పికొట్టాలి: ఇరిగేషన్ శాఖ సమీక్షా

విధాత : మేడిగడ్డ బ్యారేజి నాణ్యత పై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై తగిన సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యారేజీని పరిశీలించిన జాతీయ డ్యాం సెఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈఎంసీలు, ఇంజనీర్లతో సమావేశమైన ఆయన నివేదికలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమీక్షలో ఈఎంసీలు మురళీధర్, అనిల్ కుమార్, నాగేందర్రావు, హరి రామ్, వెంకటేశ్వర్లు, సీఈలు, టెక్నికల్ కన్సల్టెంట్ రామరాజు, సీఎం ఓఎస్డీ దేశ్ పాండేలు పాల్గొన్నారు.ఎన్‌ఎస్‌డీ నివేదికలో పేర్కొన్న అంశాలు, ఆరోపణలకు తగిన ధీటైన వివరాలతో సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయ డ్యాం సెఫ్టీ ఆథార్టీ ఇచ్చిన నివేదిక అంశాలు అసెంబ్లీ ఎన్నికల తరుణంలో తెలంగాణ ప్రభుత్వానికి ఇరకాటంగా మారడంతో ఆ నివేదికను తిప్పికొట్టే రీతిలో సమాధానం సిద్ధం చేసి పంపించాలని ప్రభుత్వం భావిస్తుంది.