Nellore | వైసీపీలో మేకపాటి శకం ముగిసినట్లేనా..?

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం పోటీకి నో. విధాత‌: నెల్లూరు (Nellore) జిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరించిన మేకపాటి కుటుంబం ఇప్పుడు మెల్లగా పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి వైదొలుగుతోందా. ఎంపీ, ఎమ్మెల్యే వంటి కీలకపదవుల్లో ఉంటూ జిల్లా రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం ఇప్పుడు ఆ ప్రభను కొనసాగించలేకపోతోందా. నెమ్మదిగా ఆ కుటుంబం రాజకీయాలకు దూరం అవుతోందా.. అంతే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మేకపాటి కుటుంబం నుంచి రాజమోహన్ రెడ్డి […]

  • Publish Date - March 29, 2023 / 10:51 AM IST
  • మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం పోటీకి నో.

విధాత‌: నెల్లూరు (Nellore) జిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరించిన మేకపాటి కుటుంబం ఇప్పుడు మెల్లగా పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి వైదొలుగుతోందా. ఎంపీ, ఎమ్మెల్యే వంటి కీలకపదవుల్లో ఉంటూ జిల్లా రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం ఇప్పుడు ఆ ప్రభను కొనసాగించలేకపోతోందా. నెమ్మదిగా ఆ కుటుంబం రాజకీయాలకు దూరం అవుతోందా.. అంతే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

మేకపాటి కుటుంబం నుంచి రాజమోహన్ రెడ్డి ఎంపీగా పలుమార్లు పని చేసారు. ఆ తరువాత అయన జగన్ వెంట నడుస్తూ తమ్ముడు, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని కూడా తనతో తీసుకువెళ్లారు. తొలుత జగన్ వెంట నడిచింది ఈ ఇద్దరే. ఆ తరువాత రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 2014 , 2019 లో వరుసగా రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత జగన్ కేబినెట్లో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు.

ఆయన ఆకస్మిక మరణంతో మేకపాటి కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో ఆత్మకూరు నుంచి రాజమోహన్ఇ రెడ్డి చిన్న కుమారుడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి గౌతమ్ రెడ్డి లేని లోటును పూరించిన ఆయన అంత యాక్టివ్ కాదని అంటారు.

ఇక మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా నాలుగవ సారి గెలిచినా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ వేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పెద్దాయన రామ్మోహన్ రెడ్డి కూడా వయోభారం, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన రాజకీయాలకు దాదాపు దూరంగానే ఉంటూ వస్తున్నారు.

ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి సైతం డెబ్బై ఏళ్ళు దాటేయడంతో రాజకీయాల్లో యాక్టివ్ గా తిరిగే అవకాశం తక్కువే. ఈ మధ్యనే ఆయన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి వచ్చారు. రెండు సార్లు ఆయన హార్ట్ కి సర్జరీ జరిగింది అని చెబుతున్నారు.

దీంతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోను అని ఆయన అంటున్నారు. తనకు వర్తమాన రాజకీయాలు అంటే విరక్తి కలుగుతోందని దాంతో రాజకీయాలు చేయడం అవసరమా అని కూడా అనిపిస్తోందని ఆయన అంటున్నారు. అందువల్ల రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని అంటున్నారు. ఇదే జరిగితే వైసీపీ నుంచి, ఇంకా మొత్తం జిల్లా రాజకీయాల నుంచి మేకపాటి కుటుంబం దూరం అయినట్లే అని అంటున్నారు.