AP Politics: జగన్ ఎన్నికల టీమ్ సిద్ధమేనా..! ఒకేసారి 54 మంది IAS అధికారుల బదిలీ

విధాత‌: లేదు లేదు.. ముందస్తు ఎన్నికలు లేవంటూనే జగన్(Jagan) తన ఏర్పాట్లలో తానున్నారు.. అంతేకాదు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. సేనలను, శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్య తరచూ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వాళ్ళను ఉత్తేజితులను చేస్తున్నారు. ఈ మధ్యనే జగన్ అధికారులతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులూ అడిగిన పనులు చేయాలనీ కూడా చెప్పారు. అదే క్రమంలో ఇప్పుడు ఏకంగా 54 మంది ఐఏఎస్(IAS) అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం […]

  • Publish Date - April 7, 2023 / 02:57 PM IST

విధాత‌: లేదు లేదు.. ముందస్తు ఎన్నికలు లేవంటూనే జగన్(Jagan) తన ఏర్పాట్లలో తానున్నారు.. అంతేకాదు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. సేనలను, శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్య తరచూ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వాళ్ళను ఉత్తేజితులను చేస్తున్నారు.

ఈ మధ్యనే జగన్ అధికారులతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులూ అడిగిన పనులు చేయాలనీ కూడా చెప్పారు. అదే క్రమంలో ఇప్పుడు ఏకంగా 54 మంది ఐఏఎస్(IAS) అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నారు. చాల కాలిక్యులేషన్లు చూసి మరీ వాళ్ళను ఆయా జిల్లాలకు, శాఖలకు బదిలీ చేసినట్లు చెబుతున్నారు.

రానున్న ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేస్తారని భావించిన వారికీ మంచి పోస్టింగులు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియా మీద జగన్ కు కోపం పోయినట్లు లేదు. ఆయన్ను మారుమూల కార్యాలయానికి పంపేశారు.

ఏపీ మాజీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం జెఎసిలో ఉంటూ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆర్.పి.సిసోదియాను ఎవరికీ తెలియని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా పంపేశారు.

వాస్తవానికి హరిచందన్ గవర్నర్‌గా ఉన్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసి.. జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమకు వేలకు జీతాలు ఇవ్వడం లేదని వారు గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. అప్పట్లో ఇది చాల పెద్ద వార్త అయింది.

ప్రభుత్వ అధికారులు అయి ఉండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం జగన్ కు కోపాన్ని తెప్పించింది. వీరికి ఆర్పీ సిసోడియానే అపాయింట్ మెంట్ ఇప్పించారని ఆగ్రహం చెందిన ప్రభుత్వం ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఏమాత్రం ప్రాధాన్యత లేని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ గా నియమించింది.

ఇటీవల గుంటూరు జిల్లాలోని ఒక దేవాలయానికి చెందిన‌ భూములకు సంబంధించి ఎన్ఓసీ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయశాఖ కమిషనర్ ఎం.హరిజవహర్ లాల్ ను ప్రభుత్వం కార్మికశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. దానిపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఆయన ఆ పోస్టుకే అర్హుడు కాదని వ్యాఖ్యానించడంతో ప్రభుత్వ పరువు పోయినట్లయింది. దీంతో ఆయన్ను అక్కడ్నుంచి తప్పించారు.