విజయసాయి ఫోన్‌ పోయిందా.. జగన్ లాక్కున్నారా!

సాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ పై టీడీపీ రాద్ధాంతం విధాత‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలో జరిగే ఎలాంటి పరిణామం అయినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, గాయి గత్తర లేపేందుకు ఇవతలి వర్గం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి ఇప్పుడు అలాంటి అవకాశమే దొరికింది. ఇక ఊరుకుంటారా.. ఒక ఆట ఆడుకుంటున్న‌ టీడీపీ నేత‌లు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి చెందిన అత్యాధునిక ఐఫోన్ ఎక్కడో మిస్సయిందని తాడేపల్లి పోలీసుస్టేషన్ లో కేసు […]

  • Publish Date - November 23, 2022 / 02:30 PM IST
  • సాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ పై టీడీపీ రాద్ధాంతం

విధాత‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలో జరిగే ఎలాంటి పరిణామం అయినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, గాయి గత్తర లేపేందుకు ఇవతలి వర్గం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి ఇప్పుడు అలాంటి అవకాశమే దొరికింది. ఇక ఊరుకుంటారా.. ఒక ఆట ఆడుకుంటున్న‌ టీడీపీ నేత‌లు.

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి చెందిన అత్యాధునిక ఐఫోన్ ఎక్కడో మిస్సయిందని తాడేపల్లి పోలీసుస్టేషన్ లో కేసు రిజిష్టర్ అయింది. అది మామూలు ఫోన్ కాదు.. అత్యంత సురక్షితమైన ఐఫోన్. అందులో రాజకీయ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన బోలెడు సమాచారం.. సీక్రెట్స్ కూడా ఉంటాయి. దీంతో ఆ ఫోన్ మిస్సింగ్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈమేరకు ఈనెల 21న ఫోన్ పోయినట్లు సాయిరెడ్డి పీఏ లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక దీని మీద రాజకీయ రచ్చ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరికి వారు ఎంపీ ఫోన్ మిస్సింగ్ మీద వ్యాఖ్యలు కామెంట్లు పోస్టు చేస్తున్నారు . ఆయన ఫోన్ కృష్ణానదిలో పడేసారా.. ఋషికొండ తవ్వకాల్లో కప్పేశారా.. జగన్ రహస్యాలు బయటకు వస్తాయని జగన్ ఆ ఫోన్ లాక్కున్నారా అంటూ టీడీపీ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాముకు సంబంధించి బోలెడు లావాదేవీలు సాయిరెడ్డి చేసారని, దర్యాప్తులో ఈ అక్రమాలు బయటకు రాకుండా సాయిరెడ్డి ఈ ఫోన్ ను ఏదో చేశారన్న సందేహాలు టీడీపీ వ్యక్తం చేస్తోంది. ఈమేరకు టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం జగన్ సహా అందరి వాటాల సమాచారమంతా ఆ ఫోన్‌లో ఉన్నందుకే దాచేశారని ఆరోపించారు.

ఈడీ విచారణలో తన ఫోన్ సీజ్ అయి మొత్తం భాగోతం బయటపడుతుందనే ఫోన్ దాచేసి.. పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారని విమర్శించారు. రుషికొండ వాటాలు, ఇతరత్రా అక్రమాల సమాచారమంతా విజయసాయి ఫోన్‌లో ఉందని ఆరోపించారు.