ISRO | సాహో ఇస్రో..! పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం విజయవంతం..!

ISRO | ఇటీవల చంద్రయాన్‌-3ని విజయవంతంగా నింగిలోకి పంపిన జోరుమీదున్నది. ప్రస్తుతం ఈ మిషన్‌ కొనసాగిస్తున్నది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 క్షక్యను పెంచుకుంటూ చందమామ దిశగా పయనిస్తున్నది. తాజాగా ఇస్రో మరో ప్రయోగాన్ని చేపట్టి విపణిలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఆదివారం పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ ప్రకటించారు. డీఎస్- […]

ISRO | సాహో ఇస్రో..! పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం విజయవంతం..!

ISRO |

ఇటీవల చంద్రయాన్‌-3ని విజయవంతంగా నింగిలోకి పంపిన జోరుమీదున్నది. ప్రస్తుతం ఈ మిషన్‌ కొనసాగిస్తున్నది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 క్షక్యను పెంచుకుంటూ చందమామ దిశగా పయనిస్తున్నది. తాజాగా ఇస్రో మరో ప్రయోగాన్ని చేపట్టి విపణిలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసింది.

శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఆదివారం పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ ప్రకటించారు. డీఎస్- సార్ ప్రధాన ఉపగ్రహంతో పాటు మరో ఆరు శాటిలైన్స్‌లో భూ కక్షలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకోగా.. వారికి సోమనాథ్‌ శుభాకాంక్షలు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం ఇస్రోకు మూడో వాణిజ్య ప్రయోగం కాగా.. దీంతో సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువున్న ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఇస్రోపై నమ్మకంతో ఉంచిన సింగపూర్‌ ప్రభుత్వానికి సోమ్‌నాథ్‌ కృతజ్ఞతలు చెప్పారు. వాహక నౌక విజయవంతంగా ఉపగ్రహాలను నిర్ధిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టిందని ప్రకటించారు. ఎస్‌ఎల్వీ సిరీస్‌లో మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో మరో ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.