Aditya-L1 | ఈ నెల 26న ఆదిత్య ఎల్ 1 ప్ర‌యోగం.. తొలిసారి చిత్రాలు విడుద‌ల చేసిన ఇస్రో

Aditya-L1 | విధాత‌: చంద్రునిపై ప‌రిశోధ‌న‌ల్లో ఇప్ప‌టికే త‌న స‌త్తా చూపించిన ఇస్రో.. త్వ‌ర‌లోనే ఆ సూర్యుని (Sun) గుట్టు కూడా విప్ప‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగానే ఈ నెల 26న ఆదిత్య ఎల్ 1 (Aditya L1) ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించ‌నుంది. తాజాగా తొలి సారి ఆ ఉప‌గ్ర‌హం ఫొటోను ఇస్రో అధికారికంగా ఎక్స్ (ట్విట‌ర్‌)లో పంచుకుంది. ఆదిత్య ఎల్ 1 ఉప‌గ్ర‌హం.. సూర్యుణ్ని శోధించ‌డానికి భార‌త్ ప్ర‌యోగిస్తున్న‌ మొట్ట‌మొద‌టి ఉప‌గ్ర‌హం అన్న విష‌యం తెలిసిందే. దీనిని […]

Aditya-L1 | ఈ నెల 26న ఆదిత్య ఎల్ 1 ప్ర‌యోగం.. తొలిసారి చిత్రాలు విడుద‌ల చేసిన ఇస్రో

Aditya-L1 | విధాత‌: చంద్రునిపై ప‌రిశోధ‌న‌ల్లో ఇప్ప‌టికే త‌న స‌త్తా చూపించిన ఇస్రో.. త్వ‌ర‌లోనే ఆ సూర్యుని (Sun) గుట్టు కూడా విప్ప‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగానే ఈ నెల 26న ఆదిత్య ఎల్ 1 (Aditya L1) ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించ‌నుంది. తాజాగా తొలి సారి ఆ ఉప‌గ్ర‌హం ఫొటోను ఇస్రో అధికారికంగా ఎక్స్ (ట్విట‌ర్‌)లో పంచుకుంది. ఆదిత్య ఎల్ 1 ఉప‌గ్ర‌హం.. సూర్యుణ్ని శోధించ‌డానికి భార‌త్ ప్ర‌యోగిస్తున్న‌ మొట్ట‌మొద‌టి ఉప‌గ్ర‌హం అన్న విష‌యం తెలిసిందే.

దీనిని పీఎస్ఎల్వీ – ఎక్స్ ఎల్ (PSLV-XL) వాహ‌క‌నౌక ద్వారా అంత‌రిక్షంలోకి పంప‌నున్నారు. బెంగ‌ళూరు లోని యూఆర్ రావు శాటిలైట్ సెంట‌ర్‌లో త‌యారైన ఆదిత్య ఎల్‌1.. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌హ‌రికోటకు చేరుకుంది. ఈ ఉప‌గ్ర‌హం ప్ర‌ధానంగా సూర్యుని చుట్టూ ఉండే కాంతి వ‌ల‌యాన్ని శోధిస్తుంది. విచిత్రంగా సూర్యుని ఉప‌రిత‌లం మీద కంటే ఈ వ‌ల‌యం వ‌ద్దే ఉష్ణోగ్ర‌త అధికంగా ఉంటుంది.

ఇందులో ఉండే ర‌హ‌స్యాన్ని ఆదిత్య ఎల్ 1 తెలుసుకునే ప్ర‌య‌త్నిస్తుంది. అలాగే సౌర తుపానులు, భూమిపై వాటి ప్ర‌భావం త‌దిత‌ర అంశాల‌ను అధ్య‌యనం చేస్తుంది. భూమికి సూర్యునికి మ‌ధ్య ఉండే హాలో ఆర్బిట్ అనే ప్రాంతంలో ఎల్ 1 అనే చోట ఈ ఉప‌గ్ర‌హాన్ని నిలిపి ఉంచుతారు. ‘ఈ ఎల్ 1 అనేది మ‌న‌కు 15 ల‌క్ష‌ల కి.మీ. దూరంలో ఉంటుంది.

ఇక్క‌డ ఉప‌గ్ర‌హాన్ని పెట్ట‌డం వ‌ల్ల సూర్యుణ్ని మ‌నం ఎప్పుడూ చూస్తూ ఉండొచ్చు. గ్ర‌హ‌ణాలు, గ్ర‌హాలు అడ్డురావ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. దీంతో సూర్యుని ప్ర‌భావం భూమిపై ఎలా ఉందో వాస్త‌వ స‌మ‌యంలో మ‌నం అధ్య‌య‌నం చేయ‌వ‌చ్చు’ అని ఇస్రో (ISRO) పేర్కొంది.

ఈ ఉప్ర‌గ‌హం త‌యారీకి రూ.378.53 కోట్లు ఖ‌ర్చు కాగా.. ప్ర‌యోగ ఖ‌ర్చులు అద‌నం. గ‌త నెల 14న ఇస్రో చంద్ర‌యాన్ 3ని ప్ర‌యోగించ‌గా.. ప్ర‌స్తుతం అది త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తోంది. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ జాబిల్లి ఉప‌రిత‌లాన్ని తాక‌నున్నాయి.