బెంగళూరు: IT ఉద్యోగినిపై లైంగిక దాడి
విధాత: బెంగళూరులో ఐటీ ఉద్యోగినిపై లైంగికదాడి జరిగింది. ఈ నెల 25న రాత్రి యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ యువత బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. రాత్రి విధుల తర్వాత ఇంటికి వెళ్లేందుకు యువతి రైడ్ బుక్ చేసుకున్నది. యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన బైక్ రైడర్ తన స్నేహితుడితో కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తు వీడాక యువతి పోలీసులకు ఫిర్యాదు […]

విధాత: బెంగళూరులో ఐటీ ఉద్యోగినిపై లైంగికదాడి జరిగింది. ఈ నెల 25న రాత్రి యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ యువత బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. రాత్రి విధుల తర్వాత ఇంటికి వెళ్లేందుకు యువతి రైడ్ బుక్ చేసుకున్నది.
యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన బైక్ రైడర్ తన స్నేహితుడితో కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తు వీడాక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్ రైడర్‌ను, అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.