సూర్యాపేటకు వచ్చేవి కాళేశ్వరం నీళ్లు కావు: మాజీ ఎంపీ బూర

విధాత: సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడిపిస్తూ కుటుంబ, అవినీతి, అరాచక పాలన సాగిస్తుంద‌ని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఆదివారం నిర్వ‌హించిన సూర్యపేట జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు. సమావేశంలో నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ లక్షన్నర కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. సూర్యాపేటకు కాళేశ్వరంతో నీళ్లు వస్తున్నాయని ప్రభుత్వం చెప్పడం అబద్ధమని వచ్చేవి […]

  • Publish Date - November 27, 2022 / 02:31 PM IST

విధాత: సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడిపిస్తూ కుటుంబ, అవినీతి, అరాచక పాలన సాగిస్తుంద‌ని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఆదివారం నిర్వ‌హించిన సూర్యపేట జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు.

సమావేశంలో నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ లక్షన్నర కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. సూర్యాపేటకు కాళేశ్వరంతో నీళ్లు వస్తున్నాయని ప్రభుత్వం చెప్పడం అబద్ధమని వచ్చేవి కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు మాత్రమేనన్నారు. ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు నీరు ఇవ్వడంలో విఫలమైన కేసీఆర్ ప్రభుత్వం ధరణితో కోటి ఎకరాల భూమిపై మాత్రం కేసీఆర్ కుటుంబం నియంత్రణ చేస్తుందన్నారు.

అసెంబ్లీ సమావేశం పెట్టి కేంద్రంపై విమర్శలు చేస్తామని కేసీఆర్ ప్ర‌క‌టిస్తున్నారు, విమర్శలను ధీటుగా తిప్పికొట్టేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. అసెంబ్లీ అంటే నేడు కేసీఆర్ గాడి అన్నట్టుగా మారిపోయిందన్నారు. కేసీఆర్ చెప్పిన ఎన్నికల హామీలు డబల్ బెడ్ రూమ్, గిరిజన బంధు, దళిత బంధు, మూడెకరాల భూమి, గిరిజన రిజర్వేషన్ ఏదీ సక్రమంగా అమలు కావడం లేదన్నారు.

కేసీఆర్‌ స్కీమ్‌ల వెనుక అన్ని స్కామ్ లేనని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ఆస్థాన కాంట్రాక్టర్లతో రాష్ట్రాన్ని దోచుకుంటుండగా సూర్యాపేటలో మంత్రి సైతం అదే మార్గంలో సాగుతున్నారన్నారు. అవినీతిలో రాష్ట్రంలో అగ్రస్థానంలో సూర్యాపేట జిల్లా ఉందన్నారు. జిల్లాలో బీజేపీ బలోపేతానికి పార్టీ నాయకత్వం ముందుకెళ్తుందన్నారు. ‘తెలంగాణ ప్రజల గోస.. బీజేపీ భరోసా’ యాత్ర జిల్లా అంతట నిర్వహించడం ద్వారా పార్టీ బలోపేతానికి, అలాగే సీఎం కేసీఆర్ అవినీతి పాలన ప్రజల్లో ఎండగట్టేందుకు కృషి చేస్తుందన్నారు.