విధాత: తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణ భగవాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన 1988 నుంచి ఇండస్ట్రీలో దాదాపు 35 ఏండ్లుగా నటుడిగా, రచయితగా రాణిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా పెద్ద వంశీ చిత్రాలకు మాటలు రాయడం అంటే సామాన్యం కాదు. అలాంటి వంశీ దర్శకత్వం వహించిన ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రానికి ఈయన రచయితగా పనిచేశాడు. అంతేకాదు ఆ చిత్రంలో విలన్ పాత్రను కూడా పోషించాడు.
మళ్లీ చాలా గ్యాప్ తర్వాత పెద్ద వంశీ దర్శకత్వంలోనే వచ్చిన ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. కృష్ణ భగవాన్ హీరోగా సిమ్రాన్‌తో కలిసి జాన్ అప్పారావు 40 ప్లస్, దొంగ సచ్చినోళ్ళు, మిస్టర్ గిరీశం, ఆంధ్ర అందగాడు, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ వంటి పలు చిత్రాలలో తనదైన కామెడీతో సత్తా చాటాడు. ఇటీవల వచ్చిన రవితేజ ధమాకలోను నటించాడు.
ఇక విషయానికి వస్తే కృష్ణ భగవాన్ మల్టీ టాలెంటెడ్. కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రచయితగా చాలా పాపులర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ బాగా ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు నవ్వు గుర్తుకు వచ్చేవారు. నాగబాబు రోజాల కాంబినేషన్ జబర్దస్త్ విజయానికి బాటలు వేసింది. ఇక అనసూయ భరద్వాజ్, రేష్మి గౌతమ్ వంటి వారు ఈ షోకు గ్లామర్ సొగసులు అద్దారు. ఆ నలుగురు జబర్దస్త్ కు నాలుగు మూల స్తంభాలుగా నిలిచారు.
నాగబాబు వెళ్ళిపోయాక జబర్దస్త్ షోలో కాస్త కళ తప్పింది. షోలో సైతం కామెడీ తగ్గి వల్గర్ ఎక్కువైంది. నాగబాబు వెళ్లిపోయింది మొదలు ఇతర కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చేశారు. చివరకు మంత్రి పదవి వచ్చి రోజా కూడా వెళ్లిపోవడంతో ఆ షోను చూసే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ షోకి పూర్వవైభవం తీసుకుని రావడానికి ఎందరో కృషి చేస్తు వచ్చారు సక్సెస్ కాలేకపోయారు.
రోజా ప్లేస్‌లో ఇంద్రజను రీప్లేస్ చేశారు. కానీ నాగబాబులా మనో ఫర్వాలేదనిపించగా, ఇంద్రజ మాత్రం ఓకే అనిపించింది. అదే సమయంలో మనో బయటకు వెళ్లడంతో కమెడియన్ కృష్ణ భగవాన్ అడుగుపెట్టాడు. ఇక అప్పటి నుంచి మళ్ళీ అభిమానుల ఆశలు చిగురించాయి. కంటెస్టెంటుల పంచ్‌లకు తోడు ఆయన కామెడీ టైమింగ్ జత కలవడంతో కంటెస్టెంట్‌లే బెదిరిపోతున్నారు. ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, కౌంటర్స్, సెటైర్లు అభిమానులకు నవ్వులు తెప్పిస్తున్నాయి.
స్వతహాగా కామెడీ టైమింగ్ ఉన్న నటుడు, రచయిత కావడంతో ఆయన షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. దీంతో ఈ షో చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాగబాబుకు ఇతనే బెస్ట్ రిప్లేస్‌మెంట్ అని అందరూ భావిస్తున్నారు. షోకు పర్మినెంట్ జడ్జిగా ఆయనను ఉంచేయడం మంచిదని అభిమానులు కోరుతున్నారు.