YS JAGAN: అమ్మో మూడో తేదీ.. ఎమ్మెల్యేలతో జగన్ భేటీ ! భారీ మార్పులకు శ్రీకారం

విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కిఎన్నికలవైపు పరుగుతీస్తున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి మూడోతేదీన ఎమ్మెల్యేలు.. ఎంపీలతో భేటీ అవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తిన్న తరువాత జరుగుతున్న ఈ భేటీలో జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో కొత్త ఇంచార్జ్ ల నియామకం ..ఎమ్మెల్యే స్థానాల మార్పులు.. రీజినల్ కోర్దినేటర్ల నియామకాలు వంటివి ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మీటింగ్ లో జగన్ ఒక్కో ఎమ్మెల్యే పని […]

  • Publish Date - April 2, 2023 / 04:04 PM IST

విధాత: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కిఎన్నికలవైపు పరుగుతీస్తున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి మూడోతేదీన ఎమ్మెల్యేలు.. ఎంపీలతో భేటీ అవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తిన్న తరువాత జరుగుతున్న ఈ భేటీలో జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు.

ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో కొత్త ఇంచార్జ్ ల నియామకం ..ఎమ్మెల్యే స్థానాల మార్పులు.. రీజినల్ కోర్దినేటర్ల నియామకాలు వంటివి ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మీటింగ్ లో జగన్ ఒక్కో ఎమ్మెల్యే పని తీరు మీద తన వద్ద ఉన్న సర్వే నివేదికలను బయట పెడతారని వారి పనితీరుని వివరించడం, వారి ప్రోగ్రస్ రిపోర్ట్ ఏంటో చెబుతారు అని అంటున్నారు.

ఇప్పటికీ ఏడాదిగా ఈ తరహా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నా ఇంకా మెరుగుపడని వారిని ఈసారి పక్కన పెడతారా అనే అనుమానాలూ వస్తున్నాయి. ఇప్పటికే ఉండవల్లి.. ప్రత్తిపాడు ఉదయగిరి నెల్లూరు రూరల్.. వెంకటగిరి వంటిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా కొత్త ఇంచార్జ్ లను నియమించిన నేపథ్యంలో ఇంకొన్ని చోట్ల కూడా ఇలాగే మార్పులు ఉంటాయని అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో వారే ఎమ్మెల్యే అభ్యర్ధులుగా అవుతారని అంటున్నారు.

మరోవైపు యాభై మంది దాకా వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ అంటూ జగన్ను మరింత రెచ్చగొడుతోంది. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పంపుతారని.. కొందరు ఎమ్మెల్యేలను ఎంపిలుగా పంపే అవకాశాలూ ఉన్న తరుణంలో ఇవన్నీ ఈ సమావేశంలో చర్చకు వస్తాయని అంటున్నారు.