సిల్క్ క‌ల‌ర్ డ్రెస్‌లో సెక్సీగా క‌నిపిస్తున్న జాన్వీ క‌పూర్.. బార్బీ డాల్‌లా ఉందంటూ కామెంట్

  • By: sn    latest    Oct 13, 2023 4:03 PM IST
సిల్క్ క‌ల‌ర్ డ్రెస్‌లో సెక్సీగా క‌నిపిస్తున్న జాన్వీ క‌పూర్.. బార్బీ డాల్‌లా ఉందంటూ కామెంట్

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఘాటు అందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. కేక పెట్టించే అందాల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని కుదురుగా ఉండ‌నియ్య‌దు. సెక్సీనెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా జాన్వీ క‌పూర్ మారింది.

వెరైటీ దుస్తుల‌లో థైస్ అందాల‌తో పాటు ఎద అందాల‌ని ఎర‌గా వేస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంది. తాజాగా బాడీ కాన్ డ్రెస్ లో టెంపరేచర్ పెంచగా ఆమె ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. జాన్వీ అందాల‌కి పోటీ ఎవ‌రు రార‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ క్రేజీ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే జాన్వీ క‌పూర్‌కి పెద్ద‌గా క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ లేవు. సినిమాలు చేస్తున్నా కూడా అవి ఓ మోస్త‌రు విజ‌యం సాధిస్తుండ‌డంతో జాన్వీ టాప్ హీరోయిన్ జాబితాలో చేర‌లేదు. అయితే ఇటీవ‌ల హాట్ స్టార్ లో విడుదలైన బవాల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో జాన్వీ క‌పూర్ ఆ విజ‌యాన్ని ఎంత‌గానో ఆస్వాదించింది.

ఈ చిత్రం ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా థియేట‌ర్‌లో విడుద‌లై ఉంటే ఆ సినిమా జాన్వీకి చాలా ప్ల‌స్ అయ్యేది. ఇందులో జాన్వీ క‌పూర్‌కి జ‌త‌గా వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన విష‌యం తెలిసిందే. నితేశ్ తివారి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ఇక ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్.. జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర అనే చిత్రం చేస్తుంది. ఈ మూవీతో సౌత్ లోకి అడుగుపెట్టిన జాన్వీ ఇందులో డిఫ‌రెంట్ రోల్ పోషిస్తుంది. ఈ చిత్రంతో మంచి హిట్ అందుకుంటుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు భావిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న‌ దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాతో జాన్వీకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ద‌క్క‌నుంది.

దేవర విజయం సాధిస్తే జాన్వీ కపూర్ దశ తిరిగినట్లే అని చెప్పాలి. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మాత్ర‌మే సినిమాలు చేస్తున్న జాన్వీ క‌పూర్‌.. దేవ‌ర హిట్ సాధిస్తే మాత్రం సౌత్‌లో కూడా స‌త్తా చాట‌నుంది. ఇప్ప‌టికే రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకునే ఆలోచనలో నిర్మాత‌లు ఉన్న‌ట్టు తెలుస్తుంది. అలానే ఓ త‌మిళ సినిమాలో కూడా జాన్వీని క‌థానాయిక‌గా అనుకుంటున్న‌ట్టు టాక్.