తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవర బ్యూటీ జాన్వీ

సినీ నటీ జాన్వీకపూర్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తన పిన్ని మాజీ నటీ మహేశ్వరీతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.

  • By: Somu    latest    Jan 05, 2024 11:57 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవర బ్యూటీ జాన్వీ

విధాత : సినీ నటీ జాన్వీకపూర్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తన పిన్ని మాజీ నటీ మహేశ్వరీతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. దివంగత అందాల నటీ శ్రీదేవి కూతురైన జాన్వీకపూర్ జాన్వీ క‌పూర్ సౌత్ ఎంట్రీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, తెలుగులో ఎన్‌టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న‘దేవర’తో ప‌ల‌క‌రించ‌బోతుంది.


అప్పట్లో తన తల్లి శ్రీదేవి.. సీనియర్ ఎన్‌టీఆర్‌తో నటిస్తే.. ఇప్పుడు జాన్వీ కపూర్.. జూనియర్ ఎన్‌టీఆర్‌తో నటిస్తుండ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. ఇక జాన్వీ దేవర’తో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది .‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ‘ఉలఝ్’ చిత్రాలు కూడా చేస్తుంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ఓటీటీ మూవీతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ‘ది ఆర్చీస్’ అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంతో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది ఖుషీ. ఇందులో ఖుషీ న‌ట‌న‌కు మిక్స్డ్ టాక్ వ‌చ్చింది.


తాజాగా జాన్వీ క‌పూర్ త‌న త‌ల్లి త‌న‌ని తెలుగులో తిట్టేద‌ని చెప్పుకొచ్చింది. ‘నేను ప్రతీసారి అమ్మ రూమ్‌కు వెళ్లి లిప్‌స్టిక్‌ను దొంగతనం చేసి పాకెట్స్ నిండా పెట్టుకొని వచ్చేదాన్ని. అప్పుడు పాకెట్లు చూపించు అనేది. నేను వద్దమ్మా అనేదాన్ని. అప్పుడు ‘నా కొడకా’ అనే తిట్టేది’’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. బూతు ప‌దాన్ని జాన్వీ క‌పూర్ చాలా క్యూట్‌గా చెప్ప‌డంతో ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.