HYDలో.. జియో స్పేషియల్ అంతర్జాతీయ సదస్సు గొప్ప విషయం: పీఎం మోడీ
విధాత: దేశం సాంకేతిక రంగంలో వేగంగా దూసుకెళ్తుందని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న రెండో ప్రపంచ జియో స్పేషియల్ అంతర్జాతీయ సదస్సులో వర్చువల్గా పాల్గొన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో ఐక్య రాజ్యసమితి, కేంద్రప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ప్రారంభించారు. సమాగ్రాభివృద్ధి, పర్యావరణం, వాతావరణ మార్పులు-సవాళ్లపై జరిగిన ఈ చర్చలో మోడీ మాట్లాడుతూ.. పర్యాటకం, ఆతిథ్యం, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే హైదరాబాద్లో సదస్సు జరగడం గొప్ప విషయమన్నారు. జియో స్పేషియల్తో […]

విధాత: దేశం సాంకేతిక రంగంలో వేగంగా దూసుకెళ్తుందని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న రెండో ప్రపంచ జియో స్పేషియల్ అంతర్జాతీయ సదస్సులో వర్చువల్గా పాల్గొన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో ఐక్య రాజ్యసమితి, కేంద్రప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ప్రారంభించారు.
సమాగ్రాభివృద్ధి, పర్యావరణం, వాతావరణ మార్పులు-సవాళ్లపై జరిగిన ఈ చర్చలో మోడీ మాట్లాడుతూ.. పర్యాటకం, ఆతిథ్యం, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే హైదరాబాద్లో సదస్సు జరగడం గొప్ప విషయమన్నారు. జియో స్పేషియల్తో గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
మనమంతా జియో స్పేషియల్ సెక్టార్లో చేరామని, జియో స్పేషియల్ సెక్టార్లో సమ్మిళిత అభివృద్ధి కనిపిస్తున్నదని, డ్రోన్లు ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులను గుర్తిస్తున్నాం అన్నారు. పీఎం గతి శక్తి ద్వారా అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించాలని సంకల్పించామని, ఈ సాంకేతికత ద్వారానే దీనిని చేయబోతున్నాం అన్నారు.
ఇప్పటికే జియో స్పేషియల్ సాంకేతికతలో మనం ఉదాహరణగా నిలిచామన్నారు. దేశం ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని, ప్రపంచంలోనే అద్భతమైన అంకురాలు భారత్లో ఉన్నాయని తెలిపారు. 2021 నుంచి అంకురాలను రెట్టింపు చేశామని, ఇది దేశంలోని యువతతోనే సాధ్యమైందన్నారు. జియో స్పేషియల్ సెక్టార్ ద్వారా ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని.. ఇందుకు ఈ సదస్సు దోహద పడుతుందన్నారు.