జేబులో పేలిన ఫోన్.. తునాతున‌క‌లైన ప్యాంట్

ఓ మొబైల్ ఫోన్ ఆక‌స్మాత్తుగా జేబులోనే పేలిపోయింది. దీంతో అత‌ని ప్యాంట్ తునాతున‌క‌లైంది. ఈ ఘ‌ట‌న గ‌ద్వాల జిల్లాలో చోటు చేసుకుంది

జేబులో పేలిన ఫోన్.. తునాతున‌క‌లైన ప్యాంట్

గ‌ద్వాల : ఓ మొబైల్ ఫోన్ ఆక‌స్మాత్తుగా జేబులోనే పేలిపోయింది. దీంతో అత‌ని ప్యాంట్ తునాతున‌క‌లైంది. ఈ ఘ‌ట‌న గ‌ద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌ద్వాల మున్సిపాలిటీ ప‌రిధిలోని బీసీ కాల‌నీకి చెందిన జ‌య‌రాముడు కూర‌గాయలు తీసుకునేందుకు మార్కెట్‌కు వ‌చ్చాడు.


ఇక కూర‌గాయ‌లు తీసుకుంటూ వ్యాపారుల‌తో మాట్లాడుతుండ‌గా, ఒక్క‌సారిగా త‌న ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ పేలిపోయింది. వెంట‌నే అత‌డు అప్ర‌మ‌త్తం కావ‌డంతో అత‌నికి ఎలాంటి గాయం కాలేదు. పేలుడు ధాటికి మొబైల్ భాగాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. జేబు కాలిపోయి, తునాతున‌క‌లైంది. దీంతో బాధితుడు, స్థానికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు