Nalgonda: లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలి.. 26 నుంచి మిర్యాలగూడలో జోడో యాత్ర: కుందూరు జానారెడ్డి

విధాత: పేపర్ లీకేజీ పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లీకేజీలో బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. మిర్యాలగూడ నియోజవర్గంలో వర్గ విభేదాలు వీడాలని సూచించానని అందరూ కలిసి పనిచేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఐక్యతతో చేపట్టాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ […]

Nalgonda: లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలి.. 26 నుంచి మిర్యాలగూడలో జోడో యాత్ర: కుందూరు జానారెడ్డి

విధాత: పేపర్ లీకేజీ పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లీకేజీలో బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

మిర్యాలగూడ నియోజవర్గంలో వర్గ విభేదాలు వీడాలని సూచించానని అందరూ కలిసి పనిచేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఐక్యతతో చేపట్టాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వివాదంలో పెట్టుకున్న కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా కార్యకర్తల సస్పెన్షన్ వేటు ఎత్తి వేసినట్లు ప్రకటించారు.

ఈనెల 26 నుంచి మిర్యాలగూడ నియోజవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందరూ కలిసి ఈ యాత్ర చేస్తారని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఆయన గెలుపున‌కు అందరు కృషి చేయాలని కోరారు.

సమావేశంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, పిసిసి సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, అర్జున్, కాంతా రెడ్డి, ఏం ఏ సలీం, అజహర్ తదితరులు పాల్గొన్నారు.