Jubilee Hills | కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ ప్రజలు: రేవంత్‌రెడ్డి

Jubilee Hills కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు విధాత: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీ హిల్స్‌లోని ఎంపీ కార్యాలయంలో అదిలాబాద్‌కు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్ణాటకలో బీజేపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు కాంగ్రెస్ ను […]

Jubilee Hills | కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ ప్రజలు: రేవంత్‌రెడ్డి

Jubilee Hills

  • కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు

విధాత: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీ హిల్స్‌లోని ఎంపీ కార్యాలయంలో అదిలాబాద్‌కు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కర్ణాటకలో బీజేపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని, ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ కు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పిలుపు ఇచ్చారు.

నిత్యం ప్రజల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలన్నారు. షాద్ నగర్ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని షాద్‌నగర్‌ నేతలు కలిసిన సందర్భంగా అన్నారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి షాద్ నగర్ ప్రజలు రెండుసార్లు మోసపోయారు. మరోసారి మోసమేందుకు సిద్దంగా లేరని రేవంత్‌ అన్నారు.