విధాత : పటిష్ట భద్రతకు మారుపేరైన అమెరికాలో ఓ మహిళా జడ్జీపై కోర్టులో నిందితుడు దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. కేసులో కేసు విచారణ సందర్భంగా లైవ్లో మహిళా జడ్జీ తీర్పునిచ్చింది. తీర్పు తనకు అనుకూలంగా ఇవ్వలేదన్న కోపంతో నిందితుడు ఆవేశంతో ఒక్క ఉదుటున మహిళా జడ్జీపై దూకి దాడి చేశాడు.
వెంటనే అప్రత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడి దాడి నుంచి జడ్జిని కాపాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా లైవ్ గా రికార్డు కావడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన అమెరికా కోర్టుల్లో భద్రతను ప్రశ్నార్ధకం చేయగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది.