పెళ్లైన తగ్గ‌నంటున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. థండ‌ర్ థైస్‌తో పిచ్చెక్కిస్తున్న చంద‌మామ‌..!

  • By: sn    latest    Oct 09, 2023 1:56 PM IST
పెళ్లైన తగ్గ‌నంటున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. థండ‌ర్ థైస్‌తో పిచ్చెక్కిస్తున్న చంద‌మామ‌..!

క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కెరీర్ మొద‌ట్లో మంచి సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకుంది. పెద్ద హీరోలంద‌రితో జ‌తక‌ట్టిన కాజ‌ల్ స్టార్ స్టేట‌స్ పొందేందుకు పెద్ద‌గా స‌మ‌యం తీసుకోలేదు.



వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలు ద‌క్కంచుకుంటూ దూసుక‌పోతుంది. 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న త‌ర్వాత కాజ‌ల్ ఇక న‌ట‌న‌కి గుడ్ బై చెబుతుంద‌ని అంద‌రు భావించారు. కాని ఈభామ మాత్రం వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.



ప్ర‌స్తుతం బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో న‌టిస్తుండ‌గా, ఆదివారం రోజు వరంగల్ లో జరిగిన భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజ‌రైంది. ఈ ఈవెంట్ లో కాజ‌ల్ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి వేడి పుట్టిస్తుంది. సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు ఘాటు అందాల‌తో ర‌చ్చ చేసే కాజ‌ల్ అగ‌ర్వాల్ తాజా ఈవెంట్‌లో బ్లాక్ డ్రెస్ తో ఘాటైన సొగసు చూపిస్తూ యమా స్టైలిష్ గా పోజులిచ్చింది.



అమ్మ‌డి ఘాటైన ఫోజులు కిక్కిచ్చేలా ఉన్నాయి. కాజల్ థైస్, క్లీవేజ్ అందాల మెరుపులతో కాజల్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. అదిరిపోయే స్కిన్ టోన్ తో హాట్ హాట్ గా అదరగొడుతున్న కాజ‌ల్‌లో గ్లామ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.



గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న ఇండియ‌న్ 2 అనే చిత్రంలో కూడా న‌టిస్తుంది. మ‌రోవైపు బిజినెస్ కూడా చూసుకుంటూ ఫ్యామిలీ వ్య‌వ‌హారాల‌ని చ‌క్క‌బెడుతుంది. కాజల్ మునుపటిలా చెక్కుచెదరని అందంతో అదరహో అనిపిస్తున్న నేప‌థ్యంలో ఈ అందాల ముద్దుగుమ్మ రానున్న రోజుల‌లో నానా ర‌చ్చ చేయ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తుంది..