Srija:మోసం అంటూ శ్రీజ భర్త షాకింగ్ కామెంట్స్..ఎవరిని ఉద్దేశించి ఇలా అన్నాడు..!
Srija: గత కొద్ది రోజులుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కొన్నాళ్లపాటు సంసారం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మనస్పర్ధల వలన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది శ్రీజ. ఆ తర్వాత చిరంజీవి.. కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో రెండో పెళ్లి జరిపించారు. వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా కూడా ఓ పాప జన్మించింది.కొన్నాళ్లు మంచిగానే ఉన్న వీరు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. విడాకులు […]

Srija: గత కొద్ది రోజులుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కొన్నాళ్లపాటు సంసారం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మనస్పర్ధల వలన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది శ్రీజ. ఆ తర్వాత చిరంజీవి.. కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో రెండో పెళ్లి జరిపించారు. వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా కూడా ఓ పాప జన్మించింది.కొన్నాళ్లు మంచిగానే ఉన్న వీరు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకున్నారు అనే ప్రచారాలు కూడా నడుస్తున్నాయి. దీనిపై ఎవరు స్పందించేదు.
కాకపోతే భార్య శ్రీజతో విడిపోయిన నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌లు చేస్తున్నారు. పరోక్షంగా ఆయన శ్రీజను టార్గెట్ చేస్తూ ఉంటారు. తాజాగా కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రాములో ఇప్పుడు మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం అంటే మోసం ఎప్పటికీ, ఎవరినీ ఆశ్చర్య పరచలేదు. కానీ నమ్మకం ఆ పని చేయగలదు అంటూ కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.. సడెన్‌గా ఆయన మోసం, నమ్మకం అంటూ ఎవరినో టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో కూడా కళ్యాణ్ దేవ్… శ్రీజపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. తనకు ఆమె గౌరవం ఇవ్వడం లేదని అర్థం వచ్చేలా పోస్ట్ చేయగా,దానికి కౌంటర్ ఇచ్చిన శ్రీజ… ప్రేమను ప్రతిదాంట్లో వెతుక్కోకూడదు. దాన్ని గుర్తించాలి అని చెప్పుకొచ్చింది. హాయిగా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాల్సిన ఈ జంట ఇలా విడిపోవడం మెగా అభిమానులని ఆందోళనకి గురి చేస్తుంది. ఇక
శ్రీజ రెండో వివాహంగా కళ్యాణ్ దేవ్ ని చేసుకోగా, ఈ దంపతులకి 2016లో పాప జన్మించింది. ఆ పాప పేరు నవిష్క కాగా, ఇటీవల పాపని చాలా మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాడు.