Kamareddy | వ‌డ‌గండ్ల‌తో న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను పరిశీలించిన రేవంత్ రెడ్డి

Kamareddy, Revanth Reddy విధాత‌: కామారెడ్డి(Kamareddy) మండలం నర్సన్నపల్లి పరిధిలో వడగాండ్ల వానకి రాలిన ధాన్యాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజి మంత్రి షబ్బిర్ అలీపరిశిలించారు. పొందుర్తి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశిలించి, రైతులతో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. రైతుల కల్లాలని పరిశిలించిన అనంతరం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతులని అదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమ‌ర్శించారు. రాష్ట్రం వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయ‌ని అన్నారు. ప్రభుత్వ […]

Kamareddy | వ‌డ‌గండ్ల‌తో న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను పరిశీలించిన రేవంత్ రెడ్డి

Kamareddy, Revanth Reddy

విధాత‌: కామారెడ్డి(Kamareddy) మండలం నర్సన్నపల్లి పరిధిలో వడగాండ్ల వానకి రాలిన ధాన్యాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజి మంత్రి షబ్బిర్ అలీపరిశిలించారు. పొందుర్తి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశిలించి, రైతులతో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు.

రైతుల కల్లాలని పరిశిలించిన అనంతరం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతులని అదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమ‌ర్శించారు. రాష్ట్రం వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయ‌ని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నార‌న్నారు.

9సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పాల‌న‌లో రైతులు సంతోషంగా లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపు, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల పండించిన పంటను స‌కాలంలో కొనుగోలు చెయకపోవడంతోనే రైతులు న‌ష్టాల‌పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పెట్టుబడి సాయం, రైతులకి పనుముట్లని ప్రభుత్వం అందించ‌ట్లేద‌న్నారు. క‌మీష‌న్ల కోసం మూడు లక్షల కోట్లు ఖ‌ర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు క‌ట్టించావ‌ని ఆరోపించారు. రైతుల ఓట్లతో గెలిచిన కేసీఆర్ వారి గుండెల్లోనే త‌న్నుతున్నాడ‌న్నారు. 8ఏండ్ల‌లో 8500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు.

రెండు లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు కేసిఆర్ కారణమని, కేసిఆర్ రైతు హంతకుడు అని మండిప‌డ్డాడు. రైతులు పండించిన‌ పంటకి గిట్టుబాటు ధర కల్పించ‌డంతో పాటు, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చెయాల‌ని డిమాండ్ చేశారు.

పంట న‌ష్ట‌పోయిన‌ రైతులకి ఎకరానికి 20వేలు, మామిడి తోట రైతులకు 50వేల నష్టపరిహారం చెల్లించాల‌ని సూచించారు. తరుగు, తేమ పేరు మీద రైతుల ఉసురు పోసుకుంటున్నారని పేర్కొన్నారు. పంట న‌ష్ట‌పోయి రైతులు దుఃఖంలో ఉంటే దావత్ ల‌ కోసం, తాగుడు కోసం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు చెస్తుందని ధ్వ‌జ‌మెత్తారు.

18 మంది సన్యాసి మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకి ప్రత్యేక నిధులు కెటాయించాలని కోరారు. ప్రతి నియోజకవర్గానికి ఒక‌ ఐఎఎస్ అధికారిని నియ‌మించి న‌ష్ట‌పోయిన పంట వివ‌రాలు సేక‌రించాల‌ని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడూ అండంగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. బిజెపి నాయకులు రైతుల విషయంలో స్పందించి రైతులకి మనోధైర్యం కల్పించాలని కోరారు.