Kangana Ranaut విధాత: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉండే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut). బాలీవుడ్‌కి చెందిన ఈ భామ.. తరుచూ ఏదో ఒక దానిపై స్పందిస్తూ.. వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను ఫైర్ బ్రాండ్ అంటుంటారు. వెనుక ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. స్టార్ హీరోయిన్గా ఎదిగిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇప్పుడు తనకు ఎవరూ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తనే ఇతరులకు అవకాశాలు ఇస్తుంది. […]
Kangana Ranaut
విధాత: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉండే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut). బాలీవుడ్‌కి చెందిన ఈ భామ.. తరుచూ ఏదో ఒక దానిపై స్పందిస్తూ.. వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను ఫైర్ బ్రాండ్ అంటుంటారు. వెనుక ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. స్టార్ హీరోయిన్గా ఎదిగిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇప్పుడు తనకు ఎవరూ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తనే ఇతరులకు అవకాశాలు ఇస్తుంది.
హీరోయిన్గా, నిర్మాతగా, దర్శకురాలిగా.. ఇలా పలు శాఖలను తనే డీల్ చేస్తుంది. అయితే ఎన్ని చేసినా కూడా.. అందాల ఆరబోత విషయంలో మాత్రం ఈ భామకు తిరుగులేదు. ఏ వేడుక అయినా.. ఆమె వేసుకొచ్చే డ్రస్ హాట్ టాపిక్ అవుతుంది. ఎక్స్‌పోజింగ్‌కు పెద్ద పీట వేస్తూ.. ఆమె వేసుకునే డ్రస్‌పై కూడా తరచూ వివాదాలు చెలరేగుతూ ఉంటాయి.
సమాజంలో జరిగే అన్యాయాలపై స్పందించడంగానీ, తనకు నచ్చిన దుస్తులు వేసుకోవడంలోగానీ.. అస్సలు వెనక్కి తగ్గని ఈ భామ.. గత కొన్ని రోజులుగా తన రూట్‌ని మార్చినట్లుగా అయితే అర్థమవుతుంది. తను ఈ మధ్య చేస్తున్న పనులు, వేసుకుంటున్న దుస్తులు చూస్తుంటే.. కంగనా తన రూట్‌ని మార్చినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆరబోత ఆపి.. ఆరాధన మొదలెట్టిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఆమెను పరిశీలిస్తే.. కంగనా విరివిగా దేవాలయాలను సందర్శిస్తోంది. మరి కావాలని చేస్తుందో.. లేదంటే నిజంగానే ఆమెకు భక్తిపై మనసు మళ్లిందో తెలియదు కానీ.. నిండైన దుస్తులలో ఇప్పుడు ఏ గుడిలో చూసినా ఆమెనే కనిపిస్తోంది.
ఇక్కడ కావాలని.. అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఈ భామ వెనుక హిందూ ఉద్ధరణ అని చెప్పుకునే ‘భారతీయ జనతా పార్టీ’ (BJP) ఉందనే విషయం తెలియంది కాదు. పలువురు బీజేపీ పెద్దలు ఆమెకు టచ్‌లో ఉన్నారు.. ఉంటుంటారు. అలాగే బీజేపీ ఏం చేసినా కంగనా దానిని వెనకేసుకొస్తుంటుంది. సోషల్ మీడియాలో కూడా డైరెక్ట్‌గా బీజేపీకి వీరభక్తురాలు అన్నట్లుగా ఆమె పోస్ట్‌లు ఉంటాయి.
ఇటీవల ఆమె విషయంలో జరిగిన కొన్ని సంఘటనల వెనుక బీజేపీ హస్తం ఉందనేలా టాక్ నడిచింది. ఇక 2020లో పద్మశ్రీ రావడం.. ‘మణికర్ణిక, పంగా’ చిత్రాలకుగానూ జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక కావడానికి కారణం కూడా ఆమె కేంద్రంతో సన్నిహితంగా ఉండటమే అనేలా కామెంట్స్ వచ్చాయి. కేంద్ర పెద్దలు సపోర్ట్ ఇంతగా ఉంది కాబట్టే.. బీజేపీ తరపున ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా సిద్ధమే అనేలా ఆమె స్టేట్మెంట్స్ ఇచ్చింది.
అన్నీ బాగుంటే.. రాబోయే ఎన్నికలలో ఆమె పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో.. పద్ధతిగా చీరలలో దర్శనమిస్తూ ఇప్పుడామె దేవాలయాలను సందర్శిస్తోంది.
మొత్తంగా చూస్తుంటే.. సినిమాటిక్‌గా కంగనా చేస్తున్న ప్రతి దానికి పరమార్థం రాజకీయ బాటే అన్నట్లుగా అయితే అర్థమవుతోంది. మరి ఆమె ఈ నిండుదనం వెనుక దాగి ఉన్న రహస్యమేమిటనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.