విధాత: రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాల కన్నా తమ వ్యక్తిగత ప్రయోజనాలకే నాయకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమకు ఎక్కడ ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో, ఎక్కడ ఎక్కువ లబ్ధి చేకూరుతుందో చూసుకుని ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. గతంలో పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ చూపించి, ఆయన్ను దేవుడిలా ఆరాధించే కమెడియన్ అలీ చివరకు పవన్ పెట్టిన జనసేనలో చేరకుండా జగన్ మొహ్హన్ రెడ్డి పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే పవన్ మీద అభిమానం ఉన్నవాళ్ళంతా అయన వెంట నడిచే సీన్ లేదని మరోమారు స్పష్టమైంది.
నెక్స్ట్ ఏమిటి?
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ సైతం పవన్ కళ్యాణ్ అంటే అభిమానం చూపిస్తారు. ఈమధ్య బీజేపీకి రాజీనామా చేసిన కన్నాను పార్టీ తరఫున జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలిశారు. అంటే పవన్ తరపున దౌత్యం కోసం వచ్చారు. తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. నాదెండ్ల పిలుపు బాగానే ఉంది.. కానీ జనసేనలో చేరితే నెక్స్ట్ ఏమిటి ? ఆ పార్టీ గమనం ఏమిటి..? ఎటు వెళ్తుంది. ఎక్కడ పోటీ చేస్తుంది. కనీసం జిల్లా, రాష్ట్ర కార్యవర్గం కూడా లేని పార్టీలో చేరి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆ ఆఫర్‌ను కన్నా కాదనుకున్నారు.
కాపు నేతగా…
టిడిపిలో చేరడమే మేలు అనుకుని అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఈమేరకు ఈనెల 23న కన్నా టిడిపిలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అయన వెంట కొందరు సీనియర్ కార్యకర్తలు సైతం బీజేపీని వీడి టిడిపిలో చేరుతారని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ తరపున ఆరు సార్లు సత్తనెపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా చేసిన కన్నా లక్ష్మి నారాయణకు కాపు నేతగా పేరుంది.
అభిమానాన్ని.. ప్రొఫెషన్‌కు లింక్ చేయలేనని
ఇక ఆయనకు పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం ఉన్నా కానీ అది వ్యక్తిగతమే కానీ ఆ అభిమానాన్ని ప్రొఫెషన్‌లకు లింక్ చేయలేనని తేల్చి చెప్పేసారు. చివరకు కెరీర్‌కు ఉపయోగపడుతుందన్న ఆశతో టిడిపిలో చేరేందుకు రెడీ అయ్యారు.