Karnataka | తీవ్ర స్థాయిలో.. ప్రభుత్వ వ్యతిరేకత! BJP పుట్టి మునగడం ఖాయమంటున్న సర్వే

Karnataka, BJP బీజేపీ పుట్టి మునగడం ఖాయమంటున్న సర్వే 40వేల నమూనాలతో ‘ఎడినా’ ఒపీనియన్‌ పోల్‌ బీజేపీ ఓటమి తథ్యమన్న సగానికిపైగా జనం నాలుగో వంతు బీజేపీ అభిమానులదీ అదే మాట కర్ణాటకలో ఈసారి బీజేపీ పుట్టి మునగడం ఖాయమని ఆ రాష్ట్రానికి చెందిన ఈదినా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దాదాపు 40వేల మందిని సంస్థ సర్వే చేయగా, బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వకూడదని సగానికి పైగానే ప్రజలు అభిప్రాయపడ్డారు. విధాత: వివాదాస్పద ఫిరాయింపులతో […]

  • Publish Date - April 26, 2023 / 12:54 PM IST

Karnataka, BJP

  • బీజేపీ పుట్టి మునగడం ఖాయమంటున్న సర్వే
  • 40వేల నమూనాలతో ‘ఎడినా’ ఒపీనియన్‌ పోల్‌
  • బీజేపీ ఓటమి తథ్యమన్న సగానికిపైగా జనం
  • నాలుగో వంతు బీజేపీ అభిమానులదీ అదే మాట

కర్ణాటకలో ఈసారి బీజేపీ పుట్టి మునగడం ఖాయమని ఆ రాష్ట్రానికి చెందిన ఈదినా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దాదాపు 40వేల మందిని సంస్థ సర్వే చేయగా, బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వకూడదని సగానికి పైగానే ప్రజలు అభిప్రాయపడ్డారు.

విధాత: వివాదాస్పద ఫిరాయింపులతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి దొడ్డిదోవన అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అప్పటినుంచి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారని సర్వే సంస్థ తెలిపింది. గత దశాబ్ద కాలంలో ఇంత అవినీతికర ప్రభుత్వాన్ని చూడలేదని సర్వేలో పాల్గొన్న అనేక మంది చెప్పారు.

బొమ్మై ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వొచ్చా? అని సర్వేలో భాగంగా ప్రశ్నించారు. 32%శాతం మంది ఎలాంటి అభిప్రాయం చెప్పలేమన్నారు. కానీ.. 67 శాతం మంది ‘లేదు’ అని సూటిగా సమాధానం చెప్పారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. బీజేపీ అభిమానుల్లో 27శాతం మంది కూడా బొమ్మై ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వకూడదని చెప్పడం. మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

183 నియోజకవర్గాల్లో సర్వే

మొత్తం 224 స్థానాలకు గాను 183 నియోజకవర్గాల్లో ఈడినా సంస్థ సర్వే చేపట్టింది. అన్ని వర్గాలు, మతాలు, కులాల నుంచి సమ నిష్పత్తిలో 40వేల మందిని ఈ సంస్థ సర్వే చేసింది. అగ్రకులాల్లో 57శాతం మంది బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకోగా, బలమైన సామాజిక వర్గమైన లింగాయత్‌లలో 53శాతం మంది మాత్రమే బొమ్మై ప్రభుత్వాన్ని కోరుకున్నారు. దళితులు, గిరిజనులు, ముస్లింలు, ఒక్కలిగలు, కురుబాస్‌ తదితరులు బీజేపీ మళ్లీ రావొద్దని చెప్పారని సర్వే సంస్థ తెలిపింది.

ఈ పదేళ్ల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు కర్ణాటకను పాలించారు. వీరిలో ఎవరిది అత్యంత అవినీతికర ప్రభుత్వమని సర్వే సంస్థ ప్రశ్నించగా.. 36 శాతం మంది బొమ్మై ప్రభుత్వాన్ని వేలెత్తి చూపారు. 14 శాతం మంది యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతికరమని పేర్కొన్నారు.

అంటే.. ప్రతి ఇద్దరిలో ఒకరు బీజేపీ ప్రభుత్వాలు అవినీతిమయమని చెప్పారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతికరమైనదని 13శాతం మంది అభిప్రాయపడగా.. 8 శాతం మంది కుమారస్వామి ప్రభుత్వం అవినీతిమయం అన్నారు. బొమ్మై ప్రభుత్వం అవినీతిమయం అని పేర్కొన్నవారిలో బీజేపీ మద్దతుదారులు 20శాతం మంది ఉండటం విశేషం.

అసమర్థ సీఎం ఎవరన్న ప్రశ్నకు కూడా బొమ్మై ప్రభుత్వమేనని ఎక్కువ మంది నుంచి సమాధానాలు వచ్చాయి. బొమ్మై ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేందుకు ఇవి సంకేతాలని సర్వే సంస్థ పేర్కొన్నది.

హంగ్‌ తప్పదంటున్న ఇతర సర్వేలు

కర్ణాటక ఎన్నికలపై ఇప్పటికే టీవీ9, సీ-వోటర్‌, పబ్లిక్‌ టీవీ మూడ్‌ ఆఫ్‌ కర్ణాటక, ఆసియా నెట్‌, సువర్ణ న్యూస్‌ జనతాకీ బాత్‌, విస్తారా న్యూస్‌, సౌత్‌ ఫస్ట్‌ పీపుల్స్‌ పల్స్‌ సంస్థలు సర్వే చేయగా.. హంగ్‌ అసెంబ్లీ వస్తుందన్న సంకేతాలు వచ్చాయి. కానీ.. కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని సంస్థలు తేల్చాయి.