Karnataka
విధాత: సుదీర్ఘకాలంపాటు బీజేపీ మేధావిగా, అటల్ బిహారీవాజపేయి, లాల్‌కృష్ణ అద్వానీలకు సన్నిహితుడుగా పనిచేసిన సుధీంద్ర కులకర్ణి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతుగా ప్రచారం చేశారు.
కులకర్ణి బ్లిట్జ్ పత్రికకు సంపాదకునిగా, పత్రికలకు కాలమిస్టుగా పనిచేశారు. బీజేపీలో అగ్ర నాయకత్వం మారిన తర్వాత ఆయన ఆ పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల్లోనే ఆయన కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారు.
రాహుల్ గాంధీ హృదయమున్న నాయకుడని కులకర్ణి కొనియాడారు. ఒక స్వతంత్ర సామాజిక కార్యకర్తగా రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు ఆయన కాలబుర్గిలో ప్రచారం సందర్భంగా వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.