Karnataka | చిరుత‌పులి కాళ్లను తాడుతో క‌ట్టి.. బైక్‌పై తీసుకెళ్లిన రైతు

Karnataka హాస‌న్: చిరుత‌పులిని చూస్తేనే శ‌రీరం వ‌ణికిపోతోంది. దాని కంట ప‌డ‌కుండా, చిక్క‌కుండా దూరంగా పరుగెడుతాము. కానీ ఓ రైతు మాత్రం త‌న‌కు ఎదురుప‌డ్డ చిరుత‌పులిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చిరుత కాళ్ల‌కు తాడు క‌ట్టి.. బైక్‌పై అట‌వీశాఖ కార్యాల‌యానికి తీసుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హాస‌న్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హాస‌న్ జిల్లా బాగివాలు గ్రామానికి చెంది ముత్తు అనే రైతు త‌న పొలానికి వెళ్తుండ‌గా, ఓ చిరుత పులి అడ్డొచ్చి రైతుపై దాడి […]

Karnataka | చిరుత‌పులి కాళ్లను తాడుతో క‌ట్టి.. బైక్‌పై తీసుకెళ్లిన రైతు

Karnataka

హాస‌న్: చిరుత‌పులిని చూస్తేనే శ‌రీరం వ‌ణికిపోతోంది. దాని కంట ప‌డ‌కుండా, చిక్క‌కుండా దూరంగా పరుగెడుతాము. కానీ ఓ రైతు మాత్రం త‌న‌కు ఎదురుప‌డ్డ చిరుత‌పులిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చిరుత కాళ్ల‌కు తాడు క‌ట్టి.. బైక్‌పై అట‌వీశాఖ కార్యాల‌యానికి తీసుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హాస‌న్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హాస‌న్ జిల్లా బాగివాలు గ్రామానికి చెంది ముత్తు అనే రైతు త‌న పొలానికి వెళ్తుండ‌గా, ఓ చిరుత పులి అడ్డొచ్చి రైతుపై దాడి చేసింది. అయిన‌ప్ప‌టికీ ఆ రైతు పారిపోకుండా చిరుత‌పై ఎదురుదాడి చేశాడు. త‌న వ‌ద్ద ఉన్న తాడుతో దాని కాళ్ల‌ను క‌ట్టేశాడు.

అనంత‌రం ఆ చిరుతపులిని త‌న బైక్‌కు తాడుతో క‌ట్టేసి, అట‌వీ శాఖ కార్యాల‌యానికి వెళ్లాడు. అక్కడకు వెళ్లాక
తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఉన్న చిరుత‌ను చూసి అధికారులు షాక్ అయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం చిరుతను ఆస్ప‌త్రికి త‌ర‌లించగా ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంది. ఈ ఘటనలో ముత్తు కూడా స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డాడు.

అయితే అవ‌గాహ‌న రాహిత్యంతోనే ముత్తు చిరుత‌పై దాడి చేశాడ‌ని అధికారుల విచార‌ణ‌లో తేలింది. రైతుకు కౌన్సెలింగ్ చేసి వ‌దిలేశారు. వన్య ప్రాణులు ఎదురు పడినప్పుడు మరోసారి ఇలాంటివి చేయకూడదని చెప్పినట్లు వెల్లడించారు. కాగా, స్వీయ రక్షణలో భాగంగానే చిరుత పులిని కట్టేశానని ముత్తు తెలిపారు.