స్టూడెంట్‌తో కిస్సులు, హ‌గ్‌ల‌తో లేడి టీచ‌ర్ రొమాన్స్..

విద్యార్థుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పించాల్సిన టీచ‌రే.. త‌ప్ప‌ట‌డుగులు వేసింది. ఓ స్టూడెంట్‌తో రొమాన్స్‌లో మునిగిపోయింది

స్టూడెంట్‌తో కిస్సులు, హ‌గ్‌ల‌తో లేడి టీచ‌ర్ రొమాన్స్..

బెంగ‌ళూరు : విద్యార్థుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పించాల్సిన టీచ‌రే.. త‌ప్ప‌ట‌డుగులు వేసింది. ఓ స్టూడెంట్‌తో రొమాన్స్‌లో మునిగిపోయింది. ముద్దులు, కౌగిలింత‌ల‌తో లేడి టీచ‌ర్ రెచ్చిపోయింది. అంతేకాదు ఈ రొమాంటిక్ సీన్ల‌ను ఫొటోషూట్ కూడా చేసింది ఆ టీచ‌ర్.

టీచ‌రేమో పింక్ క‌ల‌ర్ శారీ ధ‌రించగా, స్టూడెంటేమో ప‌సుపు రంగు షెర్వాణీ ధ‌రించాడు. ఇక ఇద్ద‌రూ ప‌చ్చ‌ని చెట్ల మ‌ధ్య రొమాన్స్‌లో మునిగిపోయారు. టీచ‌ర్ త‌న చేతిలో గులాబీ పువ్వును ప‌ట్టుకుంది. స్టూడెంట్ ఆమె కొంగు లాగుతూ త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచిన‌ట్లు ఫొటోల‌కు ఫోజులిచ్చారు. స్టూడెంట్ అంత‌టితో ఆగిపోలేదు.. ఆమెకు ముద్దులు పెట్టాడు. ఆ త‌ర్వాత టీచ‌ర్‌ను ఎత్తుకుని ఆమెను ప్రేమ‌లో ముంచెత్తాడు. టీచ‌ర్ కూడా స్టూడెంట్‌తో పోటీ ప‌డింది. స్టూడెంట్‌ను కూడా ముద్దుల‌తో ముంచెత్తింది లేడీ టీచ‌ర్. అలా ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ కొన‌సాగింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్క‌బ‌ళ్ల‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. మురుగ‌మ‌ళ్ల ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల విద్యార్థుల‌ను స్ట‌డీ టూర్‌కు తీసుకెళ్లారు. స్కూల్ హెడ్ ఆర్ పుష్ప‌ల‌త కూడా వెళ్లారు. పుష్ప‌ల‌త టీచ‌ర్.. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థితో రొమాంటిక్ ఫొటోషూట్ చేసింది. ఇక ఈ ఫొటోలు వైర‌ల్ కావ‌డంతో బాధిత విద్యార్థి పేరెంట్స్ మండ‌ల విద్యాశాఖ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. టీచ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌పై విచార‌ణ జ‌రిపి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థి త‌ల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

ఈ పరిస్థితుల నేప‌థ్యంలో మండ‌ల విద్యాధికారి వీ ఉమాదేవి పాఠ‌శాల‌ను సంద‌ర్శించి, విచార‌ణ చేప‌ట్టారు. నివేదిక‌ను డీఈవోకు స‌మ‌ర్పించ‌గా, లేడీ టీచ‌ర్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీచేశారు. ఈ ఘ‌ట‌న‌పై టీచ‌ర్ స్పందిస్తూ త‌మ ఇద్ద‌రి త‌ల్లీకుమారుడి బంధం ఉంద‌ని పేర్కొన్నారు.