Karnataka | ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.. ప్రియుడి చెంతకు వెళ్లిపోయిన వివాహిత!

కర్ణాటకలో ప్రభుత్వ పథకాన్ని వాడుకున్న మహిళ పుత్తూరు: ప్రభుత్వ పథకాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపయోగపడతాయి. అయితే.. ప్రియుడి వద్దకు వెళ్లి పోవడానికి ఒక వివాహితకు ఒక పథకం కలిసొచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకున్నది. అక్కడి సిద్ధరామయ్య ప్రభుత్వం నెరవేర్చిన కర్ణాటక (Karnataka) ఎన్నికల హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. ఈ పథకాన్ని ఉపయోగించుకున్న ఒక వివాహిత.. తన ప్రియుడిని కలుసుకునేందుకు హుబ్బళి నుంచి 11నెలల బిడ్డను, కుటుంబ సభ్యులను […]

Karnataka | ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.. ప్రియుడి చెంతకు వెళ్లిపోయిన వివాహిత!
  • కర్ణాటకలో ప్రభుత్వ పథకాన్ని వాడుకున్న మహిళ

పుత్తూరు: ప్రభుత్వ పథకాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపయోగపడతాయి. అయితే.. ప్రియుడి వద్దకు వెళ్లి పోవడానికి ఒక వివాహితకు ఒక పథకం కలిసొచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకున్నది. అక్కడి సిద్ధరామయ్య ప్రభుత్వం నెరవేర్చిన కర్ణాటక (Karnataka) ఎన్నికల హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. ఈ పథకాన్ని ఉపయోగించుకున్న ఒక వివాహిత.. తన ప్రియుడిని కలుసుకునేందుకు హుబ్బళి నుంచి 11నెలల బిడ్డను, కుటుంబ సభ్యులను వదిలేసి.. బస్సెక్కి.. పుత్తూరుకు వెళ్లిపోయింది.

ఈ మహిళకు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. ఆమెను పూర్తిగా కట్టడి చేశారని, మొబైల్‌ ఫోన్‌, డబ్బు అందకుండా చూశారని పోలీసులు తెలిపారు.
హుబ్బళికి చెందిన ఈ యువతి, పుత్తూరులో లేబర్‌గా పనిచేసే స్థానిక యువకుడు ప్రేమించుకున్నారు. అయితే.. కుటుంబ పెద్దలు వీరిద్దరికీ పెళ్లి చేసేందుకు నిరాకరించారు. వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.

గర్భవతిగా ఉన్న సదరు యువతి డెలివరీ కోసమని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. పెళ్లయినా కూడా ఆమె తన ప్రియుడితో సంబంధాలు కొనసాగించింది. పుత్తూరు వస్తే కొత్త జీవితం ప్రారంభిద్దామని ప్రియుడు చెప్పాడు. అయితే.. పుత్తూరు వెళ్లడానికి ఆమె వద్ద టికెట్‌కు డబ్బులు కూడా లేవు. ఈ సమయంలోనే ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది.

ఇదే అదనుగా తన బిడ్డను ఇంటి దగ్గరే వదిలేసి.. ప్రియుడిని కలుసుకునేందుకు బస్సెక్కి వెళ్లిపోయింది.
ఆమె ఎక్కడ ఉంటుందో ఊహించిన తల్లిదండ్రులు పుత్తూరు వెళ్లారు. సదరు యువకుడు కాదంబాడి గ్రామంలో పనిచేస్తుండేవాడు. అక్కడికి వెళ్లి విచారించగా.. అతడు కూడా కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేయగా.. వారిద్దరూ సిద్దకట్టె గ్రామంలో ఉంటున్నట్టు వెల్లడైంది.