శ్రీశైలం: ఈ నెల 26 నుంచి కార్తీక మసోత్సవాలు
విధాత: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో లవన్న గురువారం వెల్లడించారు. అన్ని కార్తీక సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నవంబర్ 8వతేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి వేయనునట్లు తెలిపారు. […]

విధాత: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో లవన్న గురువారం వెల్లడించారు.
అన్ని కార్తీక సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నవంబర్ 8వతేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి వేయనునట్లు తెలిపారు.
అయితే.. చంద్రగ్రహణం కారణంగా ఆ రోజున అన్నిఆర్జిత, శాశ్వత , పరోక్ష సేవలు నిలుపుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. రద్దీ రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో నిర్వహించే కుంకుమార్చనలు, ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తామని తెలిపారు