వీఆర్ఓల‌కు కారుణ్య నియామ‌కాలు చేయండి

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ వీఆర్ఓల సంఘం మాజీ గౌర‌వ అధ్య‌క్షుడు వింజ‌మూరి ఈశ్వ‌ర్ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు లేఖ విధాత‌: వీఆర్ఓలుగా విధులు నిర్వ‌హిస్తూ మ‌ర‌ణించిన వారి కుటుంబ స‌భ్యుల‌లో ఒక‌రికి కారుణ్య నియామ‌కం కింద ఉద్యోగాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి త‌గిన ఆదేశాలు ఇవ్వాల‌ని డైరెక్ట్ వీఆర్ ఓ ల‌సంఘం మాజీ గౌర‌వ అధ్య‌క్షులు వింజ‌మూరి ఈశ్వ‌ర్ రాష్ట్ర మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ చైర్మ‌న్‌కు లేఖ రాశారు. వీఆర్ ఓల వ్య‌వ‌స్థ ర‌ద్దుకు ముందు, […]

  • By: krs    latest    Dec 01, 2022 2:23 PM IST
వీఆర్ఓల‌కు కారుణ్య నియామ‌కాలు చేయండి
  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ వీఆర్ఓల సంఘం మాజీ గౌర‌వ అధ్య‌క్షుడు వింజ‌మూరి ఈశ్వ‌ర్
  • మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు లేఖ

విధాత‌: వీఆర్ఓలుగా విధులు నిర్వ‌హిస్తూ మ‌ర‌ణించిన వారి కుటుంబ స‌భ్యుల‌లో ఒక‌రికి కారుణ్య నియామ‌కం కింద ఉద్యోగాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి త‌గిన ఆదేశాలు ఇవ్వాల‌ని డైరెక్ట్ వీఆర్ ఓ ల‌సంఘం మాజీ గౌర‌వ అధ్య‌క్షులు వింజ‌మూరి ఈశ్వ‌ర్ రాష్ట్ర మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ చైర్మ‌న్‌కు లేఖ రాశారు.

వీఆర్ ఓల వ్య‌వ‌స్థ ర‌ద్దుకు ముందు, ర‌ద్దు అయిన త‌రువాత చాలామంది వీఆర్ ఓలు ఆనారోగ్యంతో కొంత మంది, ప్ర‌మాదాల బారిన‌ప‌డి మ‌రి కొంత మంది, కోవిడ్‌-19 విధులు నిర్వ‌ర్తిస్తూ ఇంకొంత మంది చ‌నిపోయారని తెలిపారు.

కుటుంబ పెద్ద‌దిక్కును కోల్పోవ‌డం వ‌ల్ల ఆయా కుటుంబాల‌కు ఎలాంటి ఉద్యోగ బెనిఫిట్స్ అంద‌లేద‌న్నారు. ఆయాకుటుంబాల ఆర్థిక ప‌రిస్థితిచితికి పోవ‌డం వ‌ల్ల‌వారు పిల్ల‌ల‌ను కూడ చ‌దివించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని తెలిపారు.

ఒక్క రెవెన్యూశాఖ‌లోనే కాకుండా ఇత‌ర శాఖ‌ల‌లో కూడ విధులు నిర్వ‌హిస్తూ అనేక మంది వీఆర్ ఓలు చ‌నిపోయార‌న్నారు. ఇలా వివిధ కార‌ణాల‌తో చ‌నిపోయిన‌వారి కుటుంబ స‌భ్యుల నుంచి ఒక‌రికి కారుణ్య‌ నియామ‌కం చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ చైర్మ‌న్‌ను వింజ‌మూరి ఈశ్వ‌ర్‌ను కోరారు.